
హోండా మోటార్‌సైకిల్ ఇండియా ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో హైనెస్ CB350, CB350RS బైకులను విడుదల చేసింది. సీబీ350 బైక్ ధర రూ. 2.10 లక్షల నుంచి రూ. 2.15 లక్షలు, కాగా సీబీ350ఆర్ఎస్ ధర రూ. 2.15 లక్షల నుంచి రూ. 2.18 లక్షల మధ్య ఉన్నాయి.
హోండా విడుదల చేసిన ఈ కొత్త బైక్స్ చూడటానికి మునుపటి మోడల్స్ మాదిరిగా ఉన్నప్పటికీ, కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయడం జరిగింది. కావున ధరలు రూ. 9,400 నుంచి రూ. 12,000 వరకు ఎక్కువగా ఉంటుంది. కొత్త హైనెస్ సీబీ350 ట్యాంక్‌పై రెండు తెల్లటి చారలు గమనించవచ్చు. సీబీ350ఆర్ఎస్ బైక్ గ్లోసి బ్లూ, మాట్ గ్రే/బ్లాక్ కలర్‌వే కలర్స్‌లో అందుబాటులో ఉంది.
(ఇదీ చదవండి: Oscar Natu Natu-Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ అక్షరాలా..!)
హోండా కొత్త బైకులలో 349 సీసీ, సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 21 హెచ్‌పి పవర్, 30 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. అదే సమయంలో స్ప్లిట్ సీట్ సెటప్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ సిస్టమ్ కూడా ఇందులో లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment