Honda Motorcycles
-
అదిరే ఫీచర్స్‌తో హోండా కొత్త బైక్స్.. ధర ఎంతంటే?
హోండా మోటార్‌సైకిల్ ఇండియా ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో హైనెస్ CB350, CB350RS బైకులను విడుదల చేసింది. సీబీ350 బైక్ ధర రూ. 2.10 లక్షల నుంచి రూ. 2.15 లక్షలు, కాగా సీబీ350ఆర్ఎస్ ధర రూ. 2.15 లక్షల నుంచి రూ. 2.18 లక్షల మధ్య ఉన్నాయి. హోండా విడుదల చేసిన ఈ కొత్త బైక్స్ చూడటానికి మునుపటి మోడల్స్ మాదిరిగా ఉన్నప్పటికీ, కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయడం జరిగింది. కావున ధరలు రూ. 9,400 నుంచి రూ. 12,000 వరకు ఎక్కువగా ఉంటుంది. కొత్త హైనెస్ సీబీ350 ట్యాంక్‌పై రెండు తెల్లటి చారలు గమనించవచ్చు. సీబీ350ఆర్ఎస్ బైక్ గ్లోసి బ్లూ, మాట్ గ్రే/బ్లాక్ కలర్వే కలర్స్‌లో అందుబాటులో ఉంది. (ఇదీ చదవండి: Oscar Natu Natu-Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ అక్షరాలా..!) హోండా కొత్త బైకులలో 349 సీసీ, సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 21 హెచ్‌పి పవర్, 30 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. అదే సమయంలో స్ప్లిట్ సీట్ సెటప్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ సిస్టమ్ కూడా ఇందులో లభిస్తాయి. -
రూ.800 కోట్లతో హెచ్ఎంఎస్ఐ విస్తరణ!!
న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) కార్యకలాపాల విస్తరణపై దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.800 కోట్లమేర ఇన్వెస్ట్ చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. 2017–18లో 22 శాతం వృద్ధి నమోదు చేసిన కంపెనీ 2018–19లోనూ రెండంకెల వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.800 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నాం. వరుసగా మూడో ఏడాది కూడా రెండంకెల వృద్ధిని సాధించాలని నిర్ణయించుకున్నాం’ అని హెచ్ఎంఎస్ఐ ప్రెసిడెంట్, సీఈవో మినోరు కటో తెలిపారు. -
'మగాళ్లు నడిపితేనే బైకులు నడుస్తాయా'
న్యూఢిల్లీ : అవకాశమిస్తే మహిళలు కూడా బైకులపై దూసుకెళ్తామని టాలీవుడ్ నటి తాప్సీ అన్నారు. దేశ రాజధానిలో హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్రాండ్ వెహికిల్స్ లాంచింగ్ కార్యక్రమంలో మంగళవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ.. కేవలం మగవారి కోసమే బైకులు తయారు చేయడం అంతగా భావ్యం కాదని, మహిళలు కూడా మంచి బైకర్స్ అని అన్నారు. మగవాళ్లు నడిపితేనే బైకులు వెళ్తాయా? అలా అని తాను భావించట్లేదన్నారు. వారిలాగే మేం కూడా బైకులపై దూసుకెళ్తామని చెప్పారు. మా పేరెంట్స్ అనుమతిస్తే సినిమాల్లో మాత్రమే కాదు.. బయట కూడా రెగ్యులర్‌గా బైక్ నడుపుతానని ఆమె తెలిపారు. 'ఏక్ విలన్'లో శ్రద్ధా కపూర్, 'రబ్ నే బనా ది జోడి' మూవీలో అనుష్కశర్మ, 'జిందగి న మిలేగి దుబారా' సినిమాలో క్రతినా కైఫ్, ఇతర హీరోయిన్లు కూడా చాలా సినిమాల్లో తమ బైక్ రైడింగ్ ప్రతిభను ప్రదర్శించారని ఈ సందర్భంగా తాప్సీ గుర్తుచేశారు.