'మగాళ్లు నడిపితేనే బైకులు నడుస్తాయా' | Women look as good on bike as men do: Taapsee | Sakshi
Sakshi News home page

'మగాళ్లు నడిపితేనే బైకులు నడుస్తాయా'

Published Tue, Aug 4 2015 9:37 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

'మగాళ్లు నడిపితేనే బైకులు నడుస్తాయా' - Sakshi

'మగాళ్లు నడిపితేనే బైకులు నడుస్తాయా'

న్యూఢిల్లీ : అవకాశమిస్తే మహిళలు కూడా బైకులపై దూసుకెళ్తామని టాలీవుడ్ నటి తాప్సీ అన్నారు. దేశ రాజధానిలో హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్రాండ్ వెహికిల్స్ లాంచింగ్ కార్యక్రమంలో మంగళవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ.. కేవలం మగవారి కోసమే బైకులు తయారు చేయడం అంతగా భావ్యం కాదని, మహిళలు కూడా మంచి బైకర్స్ అని అన్నారు. మగవాళ్లు నడిపితేనే బైకులు వెళ్తాయా? అలా అని తాను భావించట్లేదన్నారు.

వారిలాగే మేం కూడా బైకులపై దూసుకెళ్తామని చెప్పారు. మా పేరెంట్స్ అనుమతిస్తే సినిమాల్లో మాత్రమే కాదు.. బయట కూడా రెగ్యులర్గా బైక్ నడుపుతానని ఆమె తెలిపారు. 'ఏక్ విలన్'లో శ్రద్ధా కపూర్, 'రబ్ నే బనా ది జోడి' మూవీలో అనుష్కశర్మ, 'జిందగి న మిలేగి దుబారా' సినిమాలో క్రతినా కైఫ్, ఇతర హీరోయిన్లు కూడా చాలా సినిమాల్లో తమ బైక్ రైడింగ్ ప్రతిభను ప్రదర్శించారని ఈ సందర్భంగా తాప్సీ గుర్తుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement