
ఫోర్డ్ నుంచి ఫిగో ఆస్పైర్
న్యూఢిల్లీ : ఫోర్డ్ ఇండియా కంపెనీ కొత్త కారు ఫిగో ఆస్పైర్ ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించే ఈ కారు ధరలు రూ.4.90 లక్షల నుంచి రూ.8.24 లక్షల రేంజ్‌లో(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించామని ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ నెగైల్ హారిస్ చెప్పారు. మంచి మైలేజీ, డిజైన్, తాము వెచ్చించే డబ్బుకు తగ్గట్టు విలువ ఉన్న కారు కావాలని భారతీయులు కోరుకుంటారని, దీనిని దృష్టిలో పెట్టుకునే ఫిగో ఆస్పైర్‌ను రూపొందించామని వివరించారు.