
టైరు పంక్చరై దొరికిపోయిన ఎర్రదొంగలు
వాహనం సహా రూ.20 లక్షల విలువ గల దుంగలు స్వాధీనం
పోలీసుల అదుపులో ఒకరు, మరో ఇద్దరు పరారీ
చౌడేపల్లె: వాహనం టైరు పంక్చర్ కావడంతో ఎర్రచందనం దొంగలు దొరి కిపోయిన ఘటన మంగళవారం ఉదయం చౌడేపల్లెలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఉదయం ఏపీ16జె4821 నంబర్ గల ఫోర్డ్ ఫియెట్ కారు సోమల నుంచి చౌడేపల్లె వైపునకు అతివేగం గా వస్తోంది. కడియాలకుంట సమీపంలో ముందు టైరు పంక్చర్ అయింది. డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా మరింత వేగంగా చౌడేపల్లె బస్టాండు మీదుగా పుంగనూరు రోడ్డు వైపు వెళ్లాడు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని ఓ ప్రయివేటు రైసు మిల్లు వద్ద కారు ఆపి ఆతృతగా టైరు మార్చుతుండడం తో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్‌ఐ నాగార్జునరెడ్డి తన సిబ్బంది తో కలిసి అక్కడికి చేరుకున్నారు. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు రాడ్లతో పోలీసులపై దాడికి ప్రయత్నించారు. అందులో ఒకరిని పోలీ సులు అదుపులోకి తీసుకోగా మిగిలి న ఇద్దరు పొలాల్లోకి పారిపోయా రు. కారులో తొమ్మిది దుంగలు బయటపడ్డాయి. దొరికిన వ్యక్తి వై ఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వాడిగా గుర్తించారు.
ఇంటి దొంగల పనేనా..
పోలీసులకు దొరికిన ఎర్రచందనం దుంగలు డిపోలో నిల్వ చేసినవేన ని పోలీసులు అభిప్రాయపడుతున్నా రు. సాధారణంగా ఫారె్‌స్ట్, పోలీసులకు దుంగలు పట్టుబడితే కేసులో నమోదు చేసేందుకు దుంగల పొడ వు, బరువును పెయింట్‌తో నమో దు చేస్తారు. పోలీసులకు చిక్కిన తొమ్మిది దుంగలపైనా పెయింట్ తో వివరాలు ఉండడంతో డిపోలో నిల్వచేసిన దుంగలుగా అనుమానిస్తున్నారు. ఎస్‌ఐ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్సు పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.