
భారీగా తగ్గిన ఫోర్డ్ కార్ల ధరలు
న్యూఢిల్లీ: ఒక వైపు ప్రముఖ కార్ల కంపెనీలు తమ కార్ల ధరలను అమాంతం పెంచెస్తే అమెరికా కార్ల దిగ్గజం ఫోర్డ్ కంపెనీ మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఫోర్ట్ అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో భారత్ లో కార్ల అమ్మకాలను పెంచుకొనే వ్యూహంలో భాగంగా కాంపాక్ట్ సెడాన్ ఫోర్డ్ ఆస్పైర్, ఫిగో హ్యాచ్ బ్యాక్ మోడల్స్ కార్లను భారీగా తగ్గించింది. సుమారు రూ .25,000 నుంచి రూ 91,000 వరకు ధరల్లో కోత పెట్టింది.
సవరించిన ధరలు కింద, ఫోర్డ్ కాంపాక్ట్ సెడాన్ ఫోర్డ్ ఆస్పైర్ ఇప్పుడు 1.2 లీటర్ పెట్రోల్ మోడల్ రూ 5.76 లక్షలు, డీజిల్ రూ 6.8 లక్షల పరిధిలో అందుబాటులోకి రానుంది. అదేవిధంగా, ఫోర్డ్ ఆస్పైర్ టైటానియం మోడల్ పెట్రోల్ వేరియంట్ రూ .25,000 తగ్గి 6.80 లక్షలు, డీజిల్ రూ 91,000 వరకు ధర తగ్గి రూ 7.89 లక్షలకు అందుబాటులో ఉంటుంది.
1.2 లీటర్ పెట్రోల్ మోడల్ హ్యాచ్బ్యాక్ ఫిగో ఇప్పుడు రూ 29,000 నుంచి రూ 30,000 వరకు ధర తగ్గింపు తర్వాత రూ 4.54 లక్షలు, రూ 6.29 లక్షల రేంజ్లో ఉండనుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజీన్ మోడల్ ఇప్పుడు రూ .50,000 తగ్గి రూ 5.63 లక్షల నుంచి రూ 7.18 లక్షలగా ఉండనుంది. రెండు టాప్ ఎండ్ వెర్షన్లు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కొత్త ధరలు తక్షణమే అమలవుతాయని ఫోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. ధరలు పునరేకీకరణకు తో ఫిగో మరియు ఆస్పైర్ మోడల్స్ ను వినియోగదారులకు మరింత చేరువ చేయనున్నట్టుఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్) అనురాగ్ మెహ్రోత్రా చెప్పారు.
కాగా మార్చిలో ఇంతకు ముందు, ఫోర్డ్ ఇండియా రూ 1.12 లక్షల వరకు ధరలు తగ్గించింది. అనంతరం మారుతి సుజుకి ధర రూ 6.99 లక్షల కాంపాక్ట్ ఎస్యూవీ విటారా బ్రెజాను మార్కెట్ లో లాంచ్ చేసింది. ఫోర్ట్ అమ్మకాల్లో హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో డౌన్ స్వల్పంగా 1 శాతం మేర క్షీణించగా, కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో జనవరి-జూన్ కాలంలో 17 శాతం తగ్గాయి. రెండు టాప్ కార్ల తయారీ కంపెనీలు మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్ రూ 20,000 వివిధ మోడళ్ల ధరల పెంపుపై ప్రకటించిన సంగతి తెలిసిందే.