ఫోర్డ్‌ కంపెనీ ‘మిస్‌–డైరెక్షన్స్‌’ టీవీసీ | AutoComplete: Ford goes big with all-new 2018 Expedition | Sakshi
Sakshi News home page

ఫోర్డ్‌ కంపెనీ ‘మిస్‌–డైరెక్షన్స్‌’ టీవీసీ

Published Wed, Feb 8 2017 1:17 AM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM

ఫోర్డ్‌ కంపెనీ ‘మిస్‌–డైరెక్షన్స్‌’ టీవీసీ

ఫోర్డ్‌ కంపెనీ ‘మిస్‌–డైరెక్షన్స్‌’ టీవీసీ

హైదరాబాద్‌: ఫోర్డ్‌ కార్ల కంపెనీ ‘మిస్‌–డైరెక్షన్స్‌’ పేరుతో కొత్త టెలివిజన్‌ కమర్షియల్‌(టీవీసీ)ను ప్రసారం చేస్తోంది. ఫోర్డ్‌ కార్ల నిర్వహణ ఖరీదైన వ్యవహారమంటూ వస్తున్న అపోహలను తొలగించడానికి ఈ కొత్త టీవీసీని రూపొందించామని ఫోర్డ్‌  ఇండియా కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నిజానికి ఫోర్డ్‌ ఇకో స్పోర్ట్‌ కారు వార్షిక నిర్వహణ వ్యయం రూ.1,483 మాత్రమేనని ఫోర్డ్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌(మార్కెటింగ్‌) రాహుల్‌ గౌతమ్‌ పేర్కొన్నారు.

ఫోర్డ్‌ కార్ల నిర్వహణ చౌకగా ఉండేందుకు తాము ఎన్నో చర్యలు తీసుకున్నామని వివరించారు. తమ ఫోర్డ్‌ ఇండియా వెబ్‌సైట్‌లో సర్వీస్‌ ప్రైస్‌ కాలుక్యులేటర్, పార్ట్స్‌ ప్రైసింగ్‌ తదితర వివరాలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఈ టీవీసీని సినిమాల్లో విలన్లుగా నటించే ప్రముఖ నటీ, నటులు ప్రకాశ్‌రాజ్, గుల్షన్‌ గ్రోవర్, సుధా చంద్రన్‌లతో గ్లోబల్‌ టీమ్‌ బ్లూ రూపొందించిందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement