ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రపంచంలోనే వాహనదారులు అత్యంత ఇష్టపడే కార్లలో ఒకటైన ‘ఫోర్డు ఫియస్టా’ తయారీని నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. వాటి స్థానంలో మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై ఫోర్డ్ బాస్ మరో వారంలో స్పష్టమైన ప్రకటన చేస్తారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
1970లలో పలు సమస్యల కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో భారీగా ఇంధన ధరల పెరుగుదలకు కారణమైంది. ఫలితంగా మోడెస్ట్, ఎకనమికల్ కార్లకు డిమాండ్ పెరిగింది. దీంతో యూరోపియన్ కస్టమర్ల కోసం ఆటోమొబైల్ కంపెనీలు ఫియట్, రెనాల్ట్, వోక్స్‌వ్యాగన్ బడ్జెట్ కార్లను తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేశాయి.
చదవండి👉 యాపిల్‌కు ఎదురు దెబ్బ, ఎలక్ట్రిక్ కార్ల రహస్యాల్ని దొంగిలించిన ఉద్యోగి!
అదే సమయంలో 1972లో ప్రత్యర్ధి ఆటోమొబైల్ కంపెనీలకు పోటీగా అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త హెన్రీ ఫోర్డ్-2 రెండు డోర్లతో ‘బాబ్‌క్యాట్’ప్రాజెక్ట్ పేరుతో కారును తయారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రణాళికలు, అనేక రకాలైన కార్ల డిజైన్‌లను రూపొందించిన మూడేళ్ల తర్వాత 1975లో ఫియస్టా పేరుతో తొలి వేరియంట్ ఫోర్డు కారును ఆవిష్కరించారు.
1976లో ఆ కార్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అప్పటికే యూరోపియన్ మార్కెట్‌లో సూపర్ మినీ కార్లుగా వోక్స్ వ్యాగన్ పోలో, రెనాల్ట్ 5 లు మార్కెట్‌ను శాసిస్తుండగా.. బడ్జెట్ ధరలో నడిపేందుకు సౌకర్యంగా ఉండేలా ప్రజలు ఎలాంటి కారైతే కోరుకున్నారో.. వారి అభిరుచులకు అనుగుణంగా ఫియస్టా ఎంకే 1ను ఫోర్డు అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఆ సంస్థ రూపురేఖలు మారిపోయాయి. వెరసి నాలుగేళ్లకే (1980) వన్ మిలియన్ కార్లను అమ్మకాలు జరిపి సంచలనం సృష్టించింది.
ఆ తర్వాత మార్కెట్‌లో విడుదలైన ఫోర్డ్ ఎక్స్‌ఆర్ సైతం1980లలో రేసర్ల కలల కారుగా మారింది. 1982 నాటికి అమ్మకాలు 2 మిలియన్ల మార్కును అధిగమించాయి. యూకేలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది.
హాట్ కేకుల్లా అమ్ముడు పోతుండడంతో ఆ మోడళ్లలో ఎలాంటి మార్పులు చేయకుండా ఫోర్డు ఫియాస్టా సెకండ్ జనరేషన్ ఫియస్టా మార్క్2ను ఫోర్డ్ వాహన దారులకు పరిచయం చేశారు. 1983 - 1989 మధ్య కాలంలో తిరుగులేని కారుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది.
1989లో ఫియస్టా మార్క్ 3వ జనరేషన్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)తో చిన్న కారును తయారు చేసింది. 1.0-లీటర్ మరియు 1.1-లీటర్ ఇంజన్‌లతో వచ్చింది. నిర్వహణ ఖర్చులు సైతం తగ్గించింది.
1995లో ఫియస్టా మార్క్ 4వ జనరేషన్, 2001లో ఫియస్టా మార్క్ 5వ జనరేషన్, 2006లో ఫియస్టా 6వ జనరేషన్, 2012లో ఫియస్టా మార్క్ 7వ జనరేషన్ కార్లను మార్కెట్‌లో విడుదల చేసింది. ఆటోమొబైల్ మార్కెట్‌లో సరికొత్త సంచలనాలకు తెరతీసింది.
అయితే ఇటీవల మార్కెట్‌లో కార్ల విడిభాగాల ధరలు పెరగడం, కొనుగోలు దారులు ఎస్‌యూవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడం, ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఫోర్డ్ ఫియస్టా కారు తయారీని వచ్చే ఏడాదిలో ఫోర్డ్ నిలిపివేయనుంది. ఫోర్డ్ ఫియస్టా వేరియంట్ కార్ల తయారీ నిలిపివేతపై ఫోర్డ్ బాస్ విలియం క్లే ఫోర్డ్ స్పష్టత ఇవ్వనున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి👉 ఇండియన్ రోడ్ల రారాజు.. అంబాసిడర్ కొత్త లుక్కు చూసారా?
Comments
Please login to add a commentAdd a comment