Henry ford
-
‘చేతులెత్తేసింది’, 47ఏళ్ల తర్వాత..ఆ కార్ల తయారీ నిలిపివేయనున్న ఫోర్డ్!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రపంచంలోనే వాహనదారులు అత్యంత ఇష్టపడే కార్లలో ఒకటైన ‘ఫోర్డు ఫియస్టా’ తయారీని నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. వాటి స్థానంలో మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై ఫోర్డ్ బాస్ మరో వారంలో స్పష్టమైన ప్రకటన చేస్తారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 1970లలో పలు సమస్యల కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో భారీగా ఇంధన ధరల పెరుగుదలకు కారణమైంది. ఫలితంగా మోడెస్ట్, ఎకనమికల్ కార్లకు డిమాండ్ పెరిగింది. దీంతో యూరోపియన్ కస్టమర్ల కోసం ఆటోమొబైల్ కంపెనీలు ఫియట్, రెనాల్ట్, వోక్స్వ్యాగన్ బడ్జెట్ కార్లను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేశాయి. చదవండి👉 యాపిల్‌కు ఎదురు దెబ్బ, ఎలక్ట్రిక్ కార్ల రహస్యాల్ని దొంగిలించిన ఉద్యోగి! అదే సమయంలో 1972లో ప్రత్యర్ధి ఆటోమొబైల్ కంపెనీలకు పోటీగా అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త హెన్రీ ఫోర్డ్-2 రెండు డోర్లతో ‘బాబ్‌క్యాట్’ప్రాజెక్ట్ పేరుతో కారును తయారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రణాళికలు, అనేక రకాలైన కార్ల డిజైన్లను రూపొందించిన మూడేళ్ల తర్వాత 1975లో ఫియస్టా పేరుతో తొలి వేరియంట్ ఫోర్డు కారును ఆవిష్కరించారు. 1976లో ఆ కార్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అప్పటికే యూరోపియన్ మార్కెట్లో సూపర్ మినీ కార్లుగా వోక్స్ వ్యాగన్ పోలో, రెనాల్ట్ 5 లు మార్కెట్‌ను శాసిస్తుండగా.. బడ్జెట్ ధరలో నడిపేందుకు సౌకర్యంగా ఉండేలా ప్రజలు ఎలాంటి కారైతే కోరుకున్నారో.. వారి అభిరుచులకు అనుగుణంగా ఫియస్టా ఎంకే 1ను ఫోర్డు అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఆ సంస్థ రూపురేఖలు మారిపోయాయి. వెరసి నాలుగేళ్లకే (1980) వన్ మిలియన్ కార్లను అమ్మకాలు జరిపి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మార్కెట్లో విడుదలైన ఫోర్డ్ ఎక్స్ఆర్ సైతం1980లలో రేసర్ల కలల కారుగా మారింది. 1982 నాటికి అమ్మకాలు 2 మిలియన్ల మార్కును అధిగమించాయి. యూకేలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. హాట్ కేకుల్లా అమ్ముడు పోతుండడంతో ఆ మోడళ్లలో ఎలాంటి మార్పులు చేయకుండా ఫోర్డు ఫియాస్టా సెకండ్ జనరేషన్ ఫియస్టా మార్క్2ను ఫోర్డ్ వాహన దారులకు పరిచయం చేశారు. 1983 - 1989 మధ్య కాలంలో తిరుగులేని కారుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. 1989లో ఫియస్టా మార్క్ 3వ జనరేషన్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)తో చిన్న కారును తయారు చేసింది. 1.0-లీటర్ మరియు 1.1-లీటర్ ఇంజన్లతో వచ్చింది. నిర్వహణ ఖర్చులు సైతం తగ్గించింది. 1995లో ఫియస్టా మార్క్ 4వ జనరేషన్, 2001లో ఫియస్టా మార్క్ 5వ జనరేషన్, 2006లో ఫియస్టా 6వ జనరేషన్, 2012లో ఫియస్టా మార్క్ 7వ జనరేషన్ కార్లను మార్కెట్లో విడుదల చేసింది. ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త సంచలనాలకు తెరతీసింది. అయితే ఇటీవల మార్కెట్లో కార్ల విడిభాగాల ధరలు పెరగడం, కొనుగోలు దారులు ఎస్‌యూవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడం, ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఫోర్డ్ ఫియస్టా కారు తయారీని వచ్చే ఏడాదిలో ఫోర్డ్ నిలిపివేయనుంది. ఫోర్డ్ ఫియస్టా వేరియంట్ కార్ల తయారీ నిలిపివేతపై ఫోర్డ్ బాస్ విలియం క్లే ఫోర్డ్ స్పష్టత ఇవ్వనున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 ఇండియన్ రోడ్ల రారాజు.. అంబాసిడర్ కొత్త లుక్కు చూసారా? -
కమనీయ కథక్
"Coming together is a bigining.. keeping together is progress.. working together is success" అన్న హెన్రీ ఫోర్డ్ మాటకు ఈ జంట బెస్ట్ ఎగ్జాంపుల్! ఆ ఇద్దరూ కల్యాణంతో కళాసాధనకు ఆహ్వానం పలికారు. ఒకరినొకరు తెలుసుకుని.. ఒడిదుడుకుల్లోనూ ఒకటిగా మసలుకుంటున్నారు. కళాజగతిలో సుస్థిర స్థానం కోసం జంటగా అడుగులేస్తున్నారు కథక్ కపుల్.. రాఘవరాజ్ భట్, మంగళా భట్. రాఘవది కళానేపథ్యం ఉన్న కుటుంబం. జానపద కళారూపాల మీద అర్ధశతాబ్దానికి పైగా కృషి చేసిన గోపాల్‌రాజ్‌భట్ కొడుకు. మూడున్నరేళ్ల వయసులోనే కాళ్లకు గజ్జెకట్టాడు. మంగళ బ్యాక్‌గ్రౌండ్ కూడా అలాంటిదే. వాళ్లన్నయ్య కిరణ్ కులకర్ణి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో థియేటర్ స్టూడెంట్, ఆర్టిస్ట్! కలసింది అక్కడే.. బిర్జూ మహారాజ్ దగ్గర కథక్ నేర్చుకోవడానికి రాఘవరాజ్.. ఢిల్లీ ఎన్ఎస్డీ (నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా) ఆవరణలోని కథక్ కేంద్రలో చేరాడు. మహారాష్ట్రియన్ అయిన మంగళ కూడా కథక్ నేర్చుకోవడానికి అక్కడికే వచ్చింది. గురువే వేరు.. పండిత్ దుర్గాలాల్. కథక్ కళా క్షేత్రం ఒకరికొకరు పరిచయమయ్యేలా చేసింది.. ప్రాణ స్నేహితుల్లా మార్చింది. మంగళ తన జీవితంలోకి వస్తే నాట్యం ఓ యోగంలా మారుతుందని భావించిన రాఘవరాజ్.. తన మనసులోమాట ఆమె చెవిన వేశాడు. డ్యాన్స్ తప్ప మరో ఆలోచన లేని మంగళ.. ‘ఇద్దరికీ కథక్ కంటే మించింది లేదు. మా ఇద్దరి మోహం అదే అయినపుడు పెళ్లి మా మార్గాన్ని సుగమం చేస్తుంది’ అనుకుని సరేనంది. గురువులిద్దరి ఆశీర్వాదాలే పెళ్లి మంత్రాలై.. వీరిని జంటగా ముడివేశాయి. డ్యాన్స్ పార్టనర్స్.. ‘మా ధ్యాస, శ్వాస నాట్యమే. నాకైతే మేమిద్దరం భార్యాభర్తలమన్న స్పృహే ఉండదు. డ్యాన్స్ పార్టనర్స్ అనే అనిపిస్తుంది. ఇంటికి సంబంధించిన విషయాలు అంతగా పట్టించుకోం. మా వర్రీ, హర్రీ అంతా ప్రోగ్రామ్స్, నేను నడిపే ఆకృతి కథక్ కేంద్రం గురించే’ అని మంగళ చెప్తుంటే ‘ఇంటి విషయాలు లీస్ట్ బాదర్డ్’ అని రాఘవా ఒప్పుకుంటాడు. విమర్శలు, ప్రశంసలు రెండూ సమానమే అంటారిద్దరూ. ఇద్దరం ఒక్కటే.. ‘ప్రశంస ఎవరికి వచ్చినా ఇద్దరం తీసుకుంటాం.. విమర్శను పంచుకుంటాం’ అంటాడు రాఘవ . ‘ఇద్దరం కలసి షేర్ చేసుకున్న స్టేజ్ మీద రాఘవను మెచ్చుకుంటే నాకు గర్వంగా అనిపిస్తుంది. నన్ను మెచ్చుకున్నా.. రాఘవ కూడా అలాగే ఫీలవుతాడు’ అంటుంది మంగళ. ‘మా మధ్య ఇగోలకు స్థానం ఉండదు. మంగళ సోలో ప్రోగ్రామ్ ఉంటే టెక్నీషియన్‌గా మారిపోతా.. లైటింగ్ మొదలు అన్నీ దగ్గరుండి ఇష్టంగా చూసుకుంటా’నని చెప్తాడు రాఘవ. ‘తన సోలో ప్రోగ్రామ్స్‌కి నట్టువాంగం నేనే చెప్తా’ అని సమాధానమిచ్చింది మంగళ ఉత్సాహంగా. ‘ఇద్దరం కొరియోగ్రఫీ చేస్తాం. ‘భేషజాలకు పోకుండా ఒకరి సలహాను ఇంకొకరం పాటిస్తాం’అని రాఘవ చెప్పాడు. ‘అయితే నాది కరక్టే అనిపించినప్పుడు మాత్రం దానికే ఫిక్సయిపోతాను. కానీ రేర్‌గా’ అని చిన్నగా సవరించింది మంగళ. డ్యాన్స్ కోసమే.. ‘డ్యాన్స్ కోసమే భార్యాభర్తలమయ్యాం. కథక్ తర్వాతే ఇంకేదైనా. అలకలు, కోపతాపాలు సహజమే అయినా.. ప్రాక్టీస్‌లో పడిపోయామంటే అన్నీ మర్చిపోతాం. జంటగా ఇన్నేళ్ల ప్రయాణం డ్యాన్స్‌లోనే కాదు, మా వ్యక్తిత్వాల్లోనూ పరిణతి తెచ్చింది. ఆర్ట్ మాకిచ్చిన గిఫ్ట్ ఇది’ అని చెప్తుంది మంగళ. అవును ఈ రెండు సగాలను ఒక్కటిగా చేసి.. పరిపూర్ణత్వాన్నిచ్చిన నాట్యానికి జీవితమంతా రుణపడి ఉంటామంటారు ఈ ఇద్దరు. ఊపిరి ఉన్నంత కాలం కాళ్లగజ్జెలే కాదు అవి ముడివేసిన తమ అనుబంధమూ లయతప్పదంటున్నారు. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అని వేనోళ్ల ప్రశంసలు అందుకున్న వీరు ‘వియ్ బోత్ ఆర్ మేడ్ ఫర్ కథక్ ’ అని చాటుతున్నారు. ఇద్దరూ ఇద్దరే.. ‘దేన్నయినా ముందుగా అంచనా వేసి రిజల్ట్ చెప్పేస్తుంది మంగళ. అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టవుతుంది. నేను కాస్త లేట్‌గా రియలైజ్ అవుతూ మళ్లీ అదే తప్పును రిపీట్ చేస్తుంటాను. తప్పు తెలుసుకొని తప్పు చేయడమే నా వీక్నెస్’ అంటాడు రాఘవ నవ్వుతూ. ‘ఆయనకూ చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయ్. చక్కగా స్కెచింగ్ చేస్తుంటాడు. అంతేకాదు అందులో నేనిచ్చే సలహాలను కూడా పాటిస్తుంటాడు. ఎవరు ఏది చెప్పినా వినయంగా వినడం రాఘవ ప్లస్ పాయింట్. మనీ మేనేజ్మెంట్లో మాత్రం ఇద్దరమూ వీక్’ అని తెలిపింది. ‘టెక్నాలజీ అప్డేట్ చేసుకోవడంలో వీక్. స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయడం చేతకాదు’ అని రాఘవ అంటుంటే..‘పాపం నాకు స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చి.. తను మాత్రం ఎప్పటిదో బేసిక్ మోడల్ వాడుతుంటాడు చూడండి’ అంటూ రాఘవ చేతిలో ఉన్న ఫోన్ చూపించింది మంగళ. ‘నేను ఆల్ ఫోక్ డ్యాన్స్ ఫామ్స్, ఫోక్ సాంగ్స్‌లో కూడా బెస్ట్.. తనలోనూ ఓ హిడెన్ టాలెంట్ ఉంది. తబలా చక్కగా వాయిస్తుంది’అని భార్యలోని మెరిట్ మెచ్చుకున్నాడు. - సరస్వతి రమ