ఫోర్డ్ ఫిగో, ఆస్పైర్ స్పోర్ట్స్ కార్లు వచ్చేశాయ్! | Ford Figo and Aspire Sports Edition Launched; Prices Start At 6.31 Lakh | Sakshi
Sakshi News home page

ఫోర్డ్ ఫిగో, ఆస్పైర్ స్పోర్ట్స్ కార్లు వచ్చేశాయ్!

Published Mon, Apr 17 2017 12:50 PM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM

ఫోర్డ్ ఫిగో, ఆస్పైర్ స్పోర్ట్స్ కార్లు వచ్చేశాయ్!

ఫోర్డ్ ఫిగో, ఆస్పైర్ స్పోర్ట్స్ కార్లు వచ్చేశాయ్!

ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్, తన పాపులర్ మోడల్స్ లో స్పోర్ట్స్ ఎడిషన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పాపులర్ సబ్కాంపాక్ట్ సెడాన్ ఫోర్డ్ ఆస్పైర్, హ్యాచ్ బ్యాక్ కౌంటర్ఫార్ట్ ఫోర్డ్ ఫిగో స్పోర్ట్స్ ఎడిషన్ మోడల్స్ ను సోమవారం లాంచ్ చేసింది. పెట్రోల్, డీజిల్ ట్రిమ్స్ లలో రెండింట్లో ఈ రెండు కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఫోర్డ్ ఫిగో పెట్రోల్ వేరియంట్ ధర 6.31 లక్షల నుంచి, డీజిల్ మోడల్ ధర 7.21 లక్షల మధ్యలో ఉంటుంది. ఫోర్డ్ ఆస్పైర్ స్పోర్ట్స్ ఎడిషన్ పెట్రోల్ ట్రిమ్ ధర 6.50 లక్షలు, ఆయిల్ బర్నర్ ధర 7.60 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. రంగును ఎంపికచేసుకునే దాన్ని బట్టి బ్లాక్ లేదా వైట్ రూఫ్, బ్లాక్ లేదా వైట్ లో అవుట్సైడ్ రియర్వ్యూ మిర్రర్స్ను కంపెనీ ఫిగో స్పోర్ట్స్ కారుకు అమర్చింది. 
 
15 అంగుళాల అలాయ్ వీల్స్,  బ్లాక్ రంగుల్లో ఉండే ఇంటీరియర్స్, బ్లాక్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ స్టీరింగ్ వీల్ బెజిల్ వంటివి ఈ కారును అలరించనున్నాయి. అదేవిధంగా లెదర్ తో రూపొందిన స్టీరింగ్ వీల్ను రెడ్ కాంట్రాక్ట్స్ తో స్ట్రిక్చింగ్ చేశారు. సీట్లు కూడా రెడ్ స్ట్రిక్చింగే. దీని మాదిరిగానే  ఆస్పైర్ స్పోర్ట్స్ ఎడిషన్ కూడా ఉండనుంది. ఫిగోకు అమర్చిన మాదిరే ఒకే రకమైన ఇంజిన్లు దీనికి ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్ మొత్తం బ్లాక్ గా ఉంటుంది. దాంతో పాటు బ్లాక్ హెడ్ల్యాంప్స్ బెజిల్స్. 15 అంగుళాల సిల్వర్ అలాయ్ వీల్స్, బ్లాక్ ఇంటీరియర్స్, లెదర్తో చుట్టబడిన స్టీరింగ్, సీట్లు గ్రే రంగుల్లో స్ట్రిక్చింగ్ దీనిలో మిగతా డిజైన్ ఫీచర్లు. ఈ రెండు కార్లు కేవలం మాన్యువల్ ట్రాన్సమిషన్తోనే అందుబాటులో ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement