
ఫోర్డ్ క్లాసిక్ కార్ల ధరలు తగ్గాయ్
న్యూఢిల్లీ: ఫోర్డ్ ఇండియా కంపెనీ క్లాసిక్ సెడాన్ కార్ల ధరలను రూ. లక్ష వరకూ తగ్గించింది. ఇప్పుడు ఫోర్డ్ క్లాసిక్ కార్లు రూ.4.99 లక్షల నుంచి రూ.7.59 లక్షల రేంజ్‌లో (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) లభిస్తాయని, ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్) వినయ్ పిపర్సానియా తెలిపారు. ఈ కొత్త ధరలు బుధవారం నుంచే వర్తిస్తాయని చెప్పారు.
తమ అంతర్జాతీయ బ్రాండ్ ప్రచారం ‘గో ఫర్దర్’లో భాగంగా ఈ కార్ల ధరలను సవరించామని వివరించారు. 1.6 లీటర్ డ్యురాటెక్ పెట్రోల్, 1.4 లీటర్ టీడీసీఐ డ్యురాటార్క్ డీజిల్ ఇంజిన్ మోడళ్లలో లభించే ఈ కారులో ఫాగ్ ల్యాంప్‌లు, ఎయిర్‌బ్యాగ్స్, కీలెస్ ఎంట్రీ, స్పీడ్ సెన్సింగ్ వాల్యూమ్ కంట్రోల్ ఏబీఎస్, వంటి ప్రత్యేకతలున్నాయని వినయ్ వివరించారు.