ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఎలక్ట్రిక్ వాహనాల్లో రారాజుగా పేరొందిన టెస్లాను ఢీ కొట్టేందుకు పలు ఆటోమొబైల్ కంపెనీలు సిద్దమయ్యాయి.
ఛార్జింగే సమస్య..!
ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఛార్జింగ్ సమయం ఒక్కటే ఆయా ఆటోమొబైల్ కంపెనీలకు పెను సవాలుగా మారాయి. ఇప్పటికే టెస్లా రూపొందించిన సూపర్ ఛార్జర్స్‌తో కొంత ఉపశమనం కల్గింది. టెస్లా ఆవిష్కరించిన సూపర్ ఛార్జర్స్‌కు పోటీగా మెరుపు వేగంతో చార్జ్ అయ్యే సూపర్ ఛార్జర్స్‌ను తీసుకురావడానికి పలు కంపెనీలు తలమునకలైనాయి. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ పూర్తిగా ఫుల్ అయ్యేందుకు పట్టే సమయాన్ని తగ్గించడం కోసం పలు ఆటోమొబైల్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ ఎలక్ట్రిక్ వాహనాలకు వాడే సూపర్ ఛార్జర్స్ విషయంలో టెస్లాకు చెక్ పెడుతూ సరికొత్త ఛార్జర్‌ను ఆవిష్కరించింది.
చదవండి: లైంగిక వేధింపులు, ఎలన్ మస్క్‌కు మరో ఎదురుదెబ్బ
టెస్లాకు సూపర్ ఛార్జర్స్‌కు చెక్..!
టెస్లా తన కంపెనీ కార్ల కోసం సూపర్ ఛార్జర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఛార్జర్ సహాయంలో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను కేవలం 20 నిమిషాల్లో ఫుల్ చార్జ్ చేయవచ్చునని టెస్లా పేర్కొంటుంది. ప్రస్తుతం ఫోర్డ్ తయారుచేసిన కొత్త కేబుల్ ఛార్జర్ డిజైన్ సహాయంతో టెస్లా సూపర్ ఛార్జర్స్ కంటే 4.6 రెట్లు వేగంగా ఛార్జ్ చేయవచ్చునని తెలుస్తోంది. అంటే కేవలం 5 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను ఫుల్ చార్జ్ చేయవచ్చును. ఈ సూపర్ కేబుల్ ఛార్జర్‌ను ఫోర్డ్, పర్డ్యూ యూనివర్శిటీ సంయుక్తంగా రూపొందించినట్లు తెలుస్తోంది.
ఫాస్ట్ ఛార్జింగ్ సమయంలో వీపరితమైన వేడి...!
టెస్లా సూపర్ ఛార్జర్స్‌తో బ్యాటరీలను ఛార్జ్ చేస్తున్నప్పుడు ఆయా కేబుల్స్ వీపరితంగా వేడెక్కె అవకాశం ఉంది. దీంతో ఆయా కేబుల్స్ త్వరగా పాడైపోయే అవకాశం లేకపోలేదు. దీనిని ఛాలెంజ్‌గా తీసుకున్న పర్డ్యూ యూనివర్సిటీ, ఫోర్డ్ సరికొత్త సూపర్ ఛార్జర్ కేబుల్ డిజైన్‌ను ఆవిష్కరించాయి.
చదవండి: ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఓలా..!
Comments
Please login to add a commentAdd a comment