ప్రపంచ దేశాల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆర్థిక మాంద్యం దెబ్బకు కుదేలవుతున్నాయి. ఖర్చుల్ని తగ్గించుకుంటూ పొదుపు మంత్రం జపిస్తున్నాయి. ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఈ విధానాన్న అమలు చేయగా.. మరికొన్ని సంస్థలు అదే బాటలో పయనిస్తున్నాయి.
తాజాగా, అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోర్డ్ నిర్ణయంతో అమెరికాతో పాటు, కెనడాకు చెందిన 3వేల మంది సిబ్బంది ఉపాధి కోల్పోనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇక వీరిలో పర్మినెంట్ ఉద్యోగులు రెండువేల మంది, కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వెయ్యిమంది ఉన్నారు.
మార్కెట్‌లో పెరిగిపోతున్న పోటీ, ఆర్ధిక మాంద్యం దృష‍్ట్యా ఫోర్డ్ వాహనాలకు డిమాండ్ భారీగా పడిపోతుంది. ఈ తరుణంలో ఖర్చులు తగ్గించుకొని భవిష్యత్‌లో సురక్షితంగా ఉండేలా ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment