జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఫతేపూర్ మైసమ్మ దేవాలయం వద్ద కూల్ డ్రింక్స్ అమ్ము కుంటున్న బాలుడు విజయ్ కుమార్ తనను చదివించాలని ఆదివారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను వేడుకోగా.. ఆయన సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే.
బాలునికి కొత్త దుస్తులు, బూట్లు, సూట్ కేస్, ఇతర వస్తువులను ఇప్పించిన మంత్రి... సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారిక వాహనంలో జిల్లా కేంద్రంలోని రిషి పాఠశాలకు పంపించారు. మంత్రి స్వయంగా లగేజీని తీసుకొచ్చి బాలుడిని కారులో ఎక్కించి స్కూల్‌కు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment