![Bhadradri Kothagudem: 102 Vehicle Left Woman In Middle Of Road - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/09/28/102-Vehicle.jpg.webp?itok=KpnEuc-J)
బూర్గంపాడు (భద్రాద్రి కొత్తగూడెం): బురదమయంగా ఉన్న ఆ గ్రామ రహదారిపై వాహనం వెళ్లే పరిస్థితి లేక మూడు రోజుల బాలింతను రోడ్డుపైనే దింపి 102 వాహనం వెళ్లిపోయి న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో చోటుచేసుకుంది. సారపాక సమీపంలోని శ్రీరాంపురం ఎస్టీ కాలనీకి చెందిన పార్వతి 3 రోజుల క్రితం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పాపకు జన్మనిచ్చింది.
బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి అమ్మఒడి వాహనంలో ఇంటికి పంపించారు. అయితే ఆ వాహనం గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు సరిగా లేకపోవడంతో డ్రైవర్ శ్రీరాంపురం రహదారిపై దించేశాడు. దీంతో పార్వతి చంటిబిడ్డతో రెండు కిలోమీటర్ల దూరం నడిచి ఇంటికి చేరుకుంది. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పది రోజుల క్రితం ఇదే గ్రా మానికి చెందిన ఓ మహిళ పాముకాటుకు గురి కాగా, వాహన సౌకర్యం లేక మోసుకుంటూ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరణించింది. ఇప్పటికైనా ప్రభుత్వం తమ గ్రామానికి రోడ్డు వేయాలని స్థానికులు వేడుకుంటున్నారు.
చదవండి: గణేష్ నిమజ్జనంలో అపశృతి.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో..
Comments
Please login to add a commentAdd a comment