102 Ambulance
-
రోడ్డుపై బాలింత.. మధ్యలోనే వదిలి వెళ్లిన 102 వాహనం
బూర్గంపాడు (భద్రాద్రి కొత్తగూడెం): బురదమయంగా ఉన్న ఆ గ్రామ రహదారిపై వాహనం వెళ్లే పరిస్థితి లేక మూడు రోజుల బాలింతను రోడ్డుపైనే దింపి 102 వాహనం వెళ్లిపోయి న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో చోటుచేసుకుంది. సారపాక సమీపంలోని శ్రీరాంపురం ఎస్టీ కాలనీకి చెందిన పార్వతి 3 రోజుల క్రితం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పాపకు జన్మనిచ్చింది. బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి అమ్మఒడి వాహనంలో ఇంటికి పంపించారు. అయితే ఆ వాహనం గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు సరిగా లేకపోవడంతో డ్రైవర్ శ్రీరాంపురం రహదారిపై దించేశాడు. దీంతో పార్వతి చంటిబిడ్డతో రెండు కిలోమీటర్ల దూరం నడిచి ఇంటికి చేరుకుంది. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల క్రితం ఇదే గ్రా మానికి చెందిన ఓ మహిళ పాముకాటుకు గురి కాగా, వాహన సౌకర్యం లేక మోసుకుంటూ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరణించింది. ఇప్పటికైనా ప్రభుత్వం తమ గ్రామానికి రోడ్డు వేయాలని స్థానికులు వేడుకుంటున్నారు. చదవండి: గణేష్ నిమజ్జనంలో అపశృతి.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో.. -
మళ్లీ జీవీకే చేతికి ‘108’.. మండలానికో అంబులెన్సు..
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు అత్యవసర వైద్య సేవలందించే ‘108’వాహన టెండర్‌ను మళ్లీ జీవీకే సంస్థే దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో జీవీకేతోపాటు మరో కంపెనీ పాల్గొంది. చివరకు జీవీకే సంస్థకే టెండర్ దక్కినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. దీంతోపాటు ఈసారి 102 అమ్మ ఒడి, 104, ప్రభుత్వ ఆసుపత్రులనుంచి పేదల శవాలను వారి సొంతూళ్లకు ఉచితంగా తరలించేందుకు ఏర్పాటు చేసిన వాహనాల బాధ్యత కూడా జీవీకేకే అప్పగించారు. ప్రస్తు తం 50 వాహనాలు పేదల శవాలను ఆసుపత్రుల నుంచి సొంతూళ్లకు ఉచితంగా తీసుకెళ్తున్నాయి. ఈ నాలుగు సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఆ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం 358 వాహనాలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘108’అత్యవసర అంబులెన్స్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామాలు, పట్టణాల్లో అకస్మాత్తుగా వైద్యం అవసరమైన వారు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు ‘108’నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా ఈ అంబులెన్స్ సేవలను ఉచితంగా పొందుతున్నారు. ప్రస్తుతం 358 వాహనాలు ‘108’అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నాయి. వాటిల్లో 333 రోడ్లపై అందుబాటులో ఉండగా, మిగిలిన వాటిని రిజర్వులో ఉంచారు. అప్పట్లో కొన్ని వాహనాలు చెడిపోగా, వాటి స్థానంలో కొన్ని వాహనాలను గిఫ్ట్ ఎ స్మైల్ కింద రాజకీయ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు ఉచితంగా ఇచ్చారు. ప్రస్తుతం లక్ష మంది జనాభాకు ఒకటి చొప్పున ‘108’వాహనం ఉందని అధికారులు చెపుతున్నారు. ఫోన్ చేసిన దాదా పు 20 నిమిషాల్లో అంబులెన్స్ బాధితుల వద్దకు చేరుకోవాలనేది నిబంధన. ఈ అంబులెన్స్ సరీ్వసులను ప్రస్తుతం కూడా జీవీకే సంస్థనే నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 108 వాహనాల నిర్వహణకోసం ప్రభుత్వం ఏడాదికి రూ. 86 కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఈసారి ఎంతకు ఖరారు చేశారన్న దానిపై స్పష్టత లేదు. పలు మార్పులకు శ్రీకారం.. ప్రస్తుతమున్న ‘108’అంబులెన్స్ సేవల్లో పలు మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు జీవీకే సంస్థ ఏర్పాట్లు చేసే అవకాశముంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేట్ ఆఫ్ ఆర్ట్ కాల్ సెంటర్‌కు రూపకల్పన చేస్తారు. దాని ద్వారా కంప్యూటర్ ఆధారంగా అంబులెన్సులను ఆటోమాటిక్‌గా నడిపిస్తారు. ఆటోమాటిక్ కాల్ డి్రస్టిబ్యూటర్ (ఏసీడీ) వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. కంప్యూటర్ టెలిఫోనీ ఇంటర్ఫేస్ (సీటీఐ), వాయిస్ లాగింగ్ కేపబిలిటీస్, జీపీఎస్ ఇంటిగ్రేషన్, హైలీ సెక్యూర్డ్ నెట్‌వర్క్‌లను రూపొందిస్తారు. ఈ వ్యవస్థ ప్రస్తుతానికే కాకుండా భవిష్యత్ అవసరాలకు కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అంతేకాక దీనిని విపత్తు నిర్వహణ విభాగానికి అనుసంధానం చేస్తారు. ఇది పోలీస్, ఫైర్ సరీ్వసులతోనూ అనుసంధానం అవుతుంది. అన్ని ‘108’అంబులెన్స్‌లకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. మండలానికో ’108’వాహనం.. ఇకపై ప్రతీ మండలానికి ఒక ‘108’ వాహనాన్ని సమకూర్చాలని సర్కారు యోచిస్తోంది. తద్వారా దాని పరిధిలోని సమీప గ్రామాలకు తక్కువ సమయంలో చేరుకోవడానికి వీలుకలుగుతుందని, అనేకమందిని ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చనేది ప్రభు త్వ ఆలోచన. ప్రస్తుతం లక్ష మంది జనాభాకు ఒకటి చొప్పున ‘108’వాహనం ఉండగా, మండలానికి ఒకటి కేటాయించడం ద్వారా ప్రతీ 70 వేల జనాభాకు ఒకటి అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. చదవండి: ట్రాక్‌లో పడేదెప్పుడు? దశాబ్దకాలంగా అమలుకు నోచని వెహికిల్ ట్రాకింగ్ -
Andhra Pradesh: తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు విస్తరణ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవానంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి తరలించే తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ (102) సేవలను ప్రభుత్వం మరింత విస్తరించబోతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 270 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల్లో బాలింతలను ఇళ్లకు తరలిస్తున్నారు. వీటికి అదనంగా మరో 230 వాహనాలను కలిపి మొత్తంగా 500 వాహనాలతో సేవలను ప్రభుత్వం విస్తరిస్తోంది. రోజుకు 2 నుంచి 5 కాన్పులు జరిగే ప్రభుత్వ ఆసుపత్రికి తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉండేలా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జనవరి నుంచి 500 వాహనాల సేవలు ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం సరిపడినన్ని వాహనాలు లేక కొన్ని ప్రాంతాల్లో సొంత ఖర్చులతో ఆటోలు, బస్సుల్లో బాలింతలు ఇళ్లకు వెళుతున్నారు. ఎక్కువ వాహన సేవలు అందుబాటులోకి తీసుకురావడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలపై రవాణా ఖర్చుల భారం తగ్గనుంది. ప్రస్తుతం తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ప్రొవైడర్‌గా జీవీకే సంస్థ వ్యవహరిస్తోంది. ఈ నెలాఖరుకు జీవీకే సంస్థ గడువు ముగియనుంది. జనవరి నుంచి 104, 108 వాహన సేవలను నిర్వహిస్తున్న అరబిందో ఫార్మా సంస్థ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరించనుంది. ఈ సంస్థ 500 నూతన వాహనాలతో సేవలను ప్రారంభించనుంది. ట్రిప్పుకు ఒక్కరినే ప్రస్తుతం తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో ట్రిప్పుకు ఇద్దరు బాలింతలను తరలిస్తున్నారు. ఇద్దరు బాలింతలు, వారి వెంట ఉన్న ఇద్దరు అటెండర్లు ఒకే వాహనంలో వెళ్లడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఈ ఇబ్బందులకు ప్రభుత్వం చెక్ పెడుతూ ట్రిప్పుకు ఒకే బాలింతను తరలించే విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది. దీంతో బాలింత వెంట ఉండే ఒకరిద్దరు కుటుంబ సభ్యులు సైతం వాహనంలో వెళ్లడానికి అవకాశం లభించనుంది. -
మెకానిక్‌లమని చెప్పి అంబులెన్స్ అపహరణ
సాక్షి, ఇల్లెందు/గుండాల: తాము మెకానిక్‌లమని చెప్పి 102 అంబులెన్స్ డ్రైవర్ నుంచి తాళాలు తీసుకుని ట్రయిల్ వేస్తామంటూ ఉడాయించారు. వెంటనే సమాచారం అందించగా, పోలీ సులు వెంబడించారు. దీంతో ఇల్లెందు వద్ద వదిలి పారిపోయారు. ఈ సంఘటన మండలంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక ప్రభుత్వాసుపత్రి పరిధిలో తిరిగే 102 అంబులెన్స్‌ను రిపేరు చేయాలని ముగ్గురు గుర్తు తెలియ ని వ్యక్తులు కారులో వచ్చి ట్రయల్ వేస్తామని తాళాలు తీసుకున్నారు. ఓ వ్యక్తి అంబులెన్స్‌ను తీసుకుని వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత మిగిలిన ఇద్దరు కూడా వెళ్లిపోయారు. ఎంతసేపటికీ రాకపోవడంతో అనుమానం వచ్చిన డ్రైవర్ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పాడు. వెంటనే కాచనపల్లి, ఇల్లెందు పోలీసులకు సమాచారం అందించారు. కాచనపల్లి నుంచి అంబులెన్స్‌ను వెంబడించగా ఇల్లెందు దగ్గర వదిలి పారిపోయాడు. వెంటనే పోలీసులు 102 వాహనాన్ని ఆస్పత్రి సిబ్బందికి అప్పగించారు. -
మాతాశిశువులకు భరోసా !
పాలమూరు : మాతా, శిశువుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘102’ వాహనాలకు ఏడాది పూర్తయింది. గత ఏడాది జనవరిలో అందుబాటులోకి వచ్చిన ఈ వాహనాల ద్వారా జిల్లాలో వేలాది మందికి సేవలందాయి. గ్రామీణ ప్రాంతాల గర్భిణులు, బాలింతలు ప్రసవం, పరీక్షల కోసం ప్రభుత్వం ఆస్పత్రికి వచ్చే క్రమంలో ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులను ఆశ్రయించేవారు. తద్వారా నిర్ణీత పాయింట్లలో దిగి మళ్లీ ఆస్పత్రికి ఆటోల్లో రావాల్సిన పరిస్థితి ఉండేది. కానీ 102 వాహనాల ద్వారా నేరుగా ఇంటి నుంచి ఆస్పత్రికి, మళ్లీ ఇంటికి చేర్చే వెసలుబాటు అందుబాటులోకి రావడంతో గ్రామీణుల కష్టాలు తీరినట్లయింది. ‘అమ్మ ఒడి’లో భాగంగా... అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం 2018 జనవరిలో ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే 102 అంబులెన్స్ వాహనాలను జిల్లాలో ప్రారంభించారు. అప్పట్లో 18 వాహనాలను అందుబాటులో తీసుకువచ్చారు. గర్భం దాల్చిన మొదటి నెల నుంచి ఏ ఇబ్బందులు ఎదురైనా ఆస్పత్రికి తీసుకెళ్లడం.. అవసరమైన పరీక్షలు, చికిత్స చేయించుకున్నాక ఇంటికి తిరిగి చేర్చడానికి ఈ వాహనాలు పనిచేస్తున్నారు. ప్రసవం కోసం కూడా ఆస్పత్రికి తీసుకెళ్లి, ప్రసవం అయ్యాక మళ్లీ ఈ వాహనంలోనే బాలింత ఇంటి వరకు చేరుకోవచ్చు. ఈ సేవలన్నీ ఉచితంగానే అందుబాటులోకి రావడంతో గ్రామీణులను చక్కగా వినియోగించుకుంటున్నారు. 102 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు చాలు.. వారు సూచించిన ప్రాంతానికి వాహనాలు వస్తున్నాయి. ఇక ప్రసవం తర్వాత పరీక్షలు, పిల్లలకు 9 నెలల వయస్సు వరకు ఈ వాహనాల సేవలను ఉపయోగించుకోవచ్చు. ఫలితంగా నిరుపేదలకు మేలు జరుగుతుండగా.. ఇంటి ప్రసవాలు తగ్గి సురక్షితమైన కాన్పుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వాహనం అవసరమైతే.. వాహనం అసరమైనప్పుడు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు 102 కు డయల్ చేయాల్సి ఉంటుంది. ఇలా 12గంటల పాటు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. రాత్రి 8 అనంతరం ఉదయం 8గంటల వరకు ఈ వాహనం అవసరమైతే 108కి కాల్ చేయాలి. సేవలిలా అందుతాయి గర్భం దాల్చిన మహిళలు వైద్య పరీక్షల కోసం అమ్మ ఒడిని సద్వినియోగం చేసుకోవాలంటే 102 నంబర్‌కు ఫోన్ చేస్తే సరిపోతుంది. గర్భం దాల్చిన ప్రతీ మహిళా తన పేరును ఆశ కార్యకర్త వద్ద నమోదు చేసుకుని 9నెలల వరకు ప్ర తినెల యాంటినెంటల్ చెకప్(ఏఎంసీ) కోసం ఇం టి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లడానికి ఈ వాహన సేవలను ఉపయోగించుకోవచ్చు. వైద్య పరీక్షల తర్వాత అదే వాహనంలో ఇంటి వద్ద దిగబెడతారు. ఆల్ట్రా స్కానింగ్, రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలకు రెఫర్ చేసిన గర్భిణులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి సీహెచ్‌సీకి లేదా ఏరియా, జనరల్ ఆస్పత్రికి తీసుకువెళ్తారు. నెలవారీగా చేయించుకునే వైద్య పరీక్షల కోసం గర్భిణులులు, బాలింతలు ఈ వాహన సేవలు వాడుకోవచ్చు. గర్భిణులకు మధ్యలో ఎప్పుడైనా ఏదైనా వైద్య పరీక్ష అవసరమని గుర్తిస్తే 102 నంబర్‌కు ఫోన్‌చేస్తే ఇంటికి వచ్చి ఆస్పత్రికి తీసుకువెళ్లి, వైద్య సేవల అనంతరం ఇంటి వద్ద దించుతారు. గర్భం దాల్చినప్పటి నుంచి మహిళలు విధిగా వైద్యుల సూచనలు పాటించాల్సి ఉంది. మూడు, ఆరు తొమ్మిది నెలల్లో వైద్యులను సంప్రదించి అవసరమైన సలహాలు తీసుకోవడానికి, పరీక్షలు చేసుకోవడానికి ఆస్పత్రికి తీసుకువెళ్లడం, మళ్లీ ఇంటిదగ్గర దిగబెట్టడం ఈ వాహనం ప్రవేశపెట్టడం వెనుక ప్రధాన ఉద్దేశం. సౌకర్యంగా ఉంది మా బాబుకు చికిత్స కోసం వచ్చాం. 102 వాహనం కోసం ఫోన్ చేయగానే వచ్చారు. ఇందులో ఆస్పత్రికి రావడం నాకు, బాబుకు చాలా సౌకర్యంగా ఉంది. ఆస్పత్రి వచ్చి వెళ్లడానికి డబ్బులు లేక ఇబ్బందిగా ఉన్న సమయంలో 102లో రావడం కలిసివచ్చింది. – చంద్రకళ, రామచంద్రాపూర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలో 102 సేవలు ఉపయోగించుకునే వారి సంఖ్య ఇంకా పెరగాలి. దీనికోసం ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తల సాయంతో పల్లెలో అవగహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రస్తుతం 102 సేవలు బాగా నడుస్తున్నా.. మరింత పెంచడా నికి కృషి చేస్తాం. గర్భిణులు, బాలింతలు వీటిని అధికంగా ఉపయోగించుకునేలా వారిలో చైతన్యం రావాలి. మూడు నెలల గర్భిణి నుంచి 9నెలల శిశువు ఉన్న బాలింత వరకు ప్రతీ ఒక్కరు సేవలు ఉపయోగించుకోవచ్చు. – నసీరుద్దీన్, 102 ప్రోగ్రాం అధికారి, మహబూబ్‌నగర్ -
గర్భిణులకు 102 సేవలు
అలంపూర్ : గర్భిణులకు వైద్య సేవలే కాదు రవాణా కష్టాలు దూరమయ్యాయి. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అమ్మఒడిలో భాగంగా 102 సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంత కాల ం బస్సులు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ఆపసోపాలతో ఆస్పత్రికి చేరిన గర్భిణులకు 102 వాహనసేవలు ఊరటనిస్తున్నాయి. 102 వాహనంలోనే ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షల అనంతరం అదే వాహనంలో ఇంటికి సురక్షింతంగా చేరుకుంటున్నారు. దీంతో బస్సులు, ప్రైవేటు వాహనాల కోసం నిరీక్షణ తప్పింది. అలంపూర్, ఉండవెల్లి మండలంలోని క్యాతూర్ పీహెచ్సీ పరిధిలోని గ్రామాలకు 102 ద్వారా సేవలందిస్తున్నారు. ప్రభుత్వం అమ్మఒడి పథకంలో భాగంగా 102 వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగానే అలం పూర్, ఉండవెల్లి మండలాలకు సేవలం దించేలా ఒక వాహనం ఏర్పాటు చేశారు. ఇటివలే దాన్ని అలంపూర్ ఆస్పత్రిలో ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ప్రారంభిం చారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చి న వాహనం ద్వారా ఆయా గ్రామాల్లోని గర్భిణులను 102 వాహనం ద్వారా క్యా తూర్ పీహెచ్‌సీకి చేరవేస్తున్నారు. అనంతరం అదే వాహనంలో తిరిగి వారి ఇం టి వద్ద వదిలేస్తున్నారు. దీంతో సులభతరంగా ఆస్పత్రికి వచ్చి ప్రభుత్వ వైద్యశాలలోనే గర్భిణులు మహిళలు వైద్య సేవలు అందుకునే అవకాశం కలిగింది. సబ్ సెంటర్ల వారీగా సేవలు.. క్యాతూర్ పీహెచ్సీలో సబ్‌సెంటర్ల వారీగా 102 ద్వారా సేవలందిస్తున్నారు. క్యాతూర్ పీహెచ్సీ పరిధిలో మొత్తం 7 సబ్‌సెంటర్లు ఉన్నాయి. క్యాతూర్ సబ్ సెంటర్లో క్యాతూర్, భీమవరం, యాపల్దేవిపాడు, అలంపూర్ సబ్ సెంటర్లో అలంపూర్, కాశీపురం సబ్ సెంట్లో కాశీపురం, ఇమాంపురం, బైరాపురం, బస్వాపురం, సింగవరం–1, సింగవరం–2, లింగనవాయి సబ్ సెంటర్లో లింగనవాయి, కోనేరు, ఉట్కూరు, తక్కశీల సబ్ సెంటర్లో తక్కశీల, ప్రాగటూరు, శేరుపల్లి, మారమునగాల–1, మారమునగాల–2, గొందిమల్ల సబ్ సెంటర్లో గొందిమల్ల, బుక్కాపురం, బైరన్‌పల్లి, సుల్తానాపురం సబ్సెంటర్లో సుల్తానాపురం, ర్యాలంపాడు, జిల్లెలపాడు గ్రామాలు ఉన్నాయి. ఈ సబ్ సెంటర్లలో ఒక్కో సబ్ సెంటర్‌కు ఒక్క రోజు కేటాయించి ఆ రోజు ఆయా గ్రామాల నుంచి ఆశ కార్యకర్తలు గర్భిణులను పీహెచ్‌సీకి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరిగి వాళ్ల ఇళ్లకు చేర్చుతున్నారు. సంతోషంగా ఉంది... క్యాతూర్ పీహెచ్‌సీకి వైద్య పరీక్షల నిమిత్తం రా వడం ఇబ్బందిగా ఉండేది. సమయానికి బస్సులు, ఆటోలు రాక ఇబ్బందులు పడ్డాం. దీంతో సమయానికి చేరుకోలేక వైద్య పరీక్షలు చేయించుకోవడం కష్టంగా ఉండేది. 102 వాహనం రావడంతో ఆ కష్టాలు దూరమయ్యాయి. వైద్య పరీక్షలకు వెళ్లడానికి ఇబ్బందులు తొలగాయి. వాహనం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. – కృష్ణవేణి, గర్భిణి, ఉట్కూరు సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం 102 సేవలు అందుబాటులోకి తెచ్చింది. అందుకే ఒ క్కో సబ్ సెంటర్ పరిధిలోని గ్రా మానికి ఒక రోజు కేటాయించాం. గర్భిణులు 102 వాహనంలో వచ్చి వైద్య సేవల అనంతరం తిరిగి వెళ్లవచ్చు. ఈ అవకాశం ప్రతి గర్భిణి సద్వినియోగం చేసుకోవాలి. – అనురాధ, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్, క్యాతూర్