
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ తాజాగా టాంజానియా పోలీసు బలగాలకు 150 వాహనాలను సరఫరా చేసింది. వీటిలో సిబ్బంది ప్రయాణించేందుకు కావాల్సిన బస్‌లు, పోలీస్ ట్రూప్ క్యారియర్స్, అంబులెన్స్‌లు, రికవరీ ట్రక్స్, సరుకు రవాణా వాహనాలు ఉన్నాయి.
టాంజానియా పోలీసు బలగాలు ఇప్పటికే అశోక్ లేలాండ్ తయారీ 475 వాహనాలను విని యోగిస్తున్నాయి. మరిన్ని వెహికిల్స్‌ను టాంజానియాకు సరఫరా చేయనున్నట్టు ప్రకటించింది.