కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకీ రోడ్డు నిబంధనలను కఠినతరం చేస్తూ వస్తుంది. తాజాగా రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ(ఎంఓఆర్‌టీహెచ్) రోడ్డుపై నడిచే అన్ని వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్'ని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలకు తప్పనిసరిగా ఫిట్‌నెస్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ మార్క్ వాలిడిటీని నిర్ణీత పద్ధతిలో చూపించడానికి కేంద్రం నేడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ వాహనం నెంబరు ప్లేట్ తరహాలోనే ఉంటుంది. దీని మీద వేహికల్ ఫిట్‌నెస్ గడువు తేదీని స్పష్టంగా కనబడుతుంది. ఈ సర్టిఫికేట్ DD-MM-YY ఫార్మట్'లో ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
భారీ వస్తువులు/ప్యాసింజర్ వాహనాలు, మీడియం గూడ్స్/ప్యాసింజర్ వాహనాలు, తేలికపాటి మోటారు వాహనాల విషయంలో విండ్ స్క్రీన్ ఎడమ వైపున ఎగువ అంచున దీనిని ప్రదర్శించాలని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. ఆటో రిక్షాలు, ఈ-రిక్షాలు, ఈ-కార్ట్లు & క్వాడ్రిసైకిల్స్ విషయంలో విండ్ స్క్రీన్ ఎడమ వైపున ఎగువ అంచున ఈ సర్టిఫికేట్ ఉంటుంది. ఇక మోటార్ సైకిళ్లకు వాహనా మీద స్పష్టంగా కనిపించ భాగంలో దీనిన్ ఉంచాలని తెలిపింది. నోటిఫికేషన్ ప్రకారం, వాహనాలు టైప్ అరియాల్ బోల్డ్ స్క్రిప్ట్'లో నీలం బ్యాక్ గ్రౌండ్ పై పసుపు రంగులో సమాచారాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది.
MoRTH has issued a draft notification according to which validity of fitness certificate (in format DD-MM-YYYY) and registration mark of the motor vehicle shall be exhibited on the vehicles in the manner as prescribed in the draft rules. pic.twitter.com/g0D0sIoTkJ
— MORTHINDIA (@MORTHIndia) March 3, 2022
ఇందుకు సంబంధించి రాబోయే 30 రోజుల్లో ప్రజలు, ఇతర వాటాదారులు సూచనలు చేయలని మంత్రిత్వ శాఖ కోరింది. ప్రభుత్వ డేటా ప్రకారం, భారతదేశంలో 20 ఏళ్లు పైబడిన 51 లక్షల లైట్ మోటార్ వాహనాలు ఉన్నాయి. అలాగే 15 ఏళ్ల కంటే ఎక్కువ లైఫ్ గల 34 లక్షల వాహనాలు దేశంలో ఉన్నాయి. 15 ఏళ్లు పైబడిన మరో 17 లక్షల మీడియం & హెవీ కమర్షియల్ వేహికల్స్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండా ఉన్నాయి.
(చదవండి: కొత్త కారు కొనేవారికి బంపరాఫర్.. హోండా కార్లపై భారీగా డిస్కౌంట్!)
Comments
Please login to add a commentAdd a comment