సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా) : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఇటీవలే అభివృద్ధి చేసిన స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ను ప్రయివేట్ అంతరిక్ష సంస్థలకు అప్పగించేందుకు ఆ సంస్థలకు ఆహ్వానం పలుకుతోంది. ప్రపంచ మార్కెట్‌లో చిన్న తరహా ఉపగ్రహాలకు వాణిజ్యపరంగా మంచి డిమాండ్ ఉండటంతో భూమికి అతి తక్కువ దూరంలో, అంటే లియో ఆర్బిట్‌లోకి వాటిని పంపేందుకు ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌కు రూపకల్పన చేశారు.
ప్రపంచంలో అంతరిక్ష కేంద్రాలు లేని దేశాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి దేశాలకు భారతదేశం అతి తక్కువ ధరకే చిన్న తరహా ఉపగ్రహ ప్రయోగాలు చేస్తోంది. ఇటీవల దాకా పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగిస్తూ వచ్చారు.
ఈ ప్రయోగాల కోసమే ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌లతో పాటు ప్రయోగ కేంద్రాన్ని కూడా తమిళనాడులో కులశేఖర్‌పట్నంలో నిర్మిస్తున్నారు. ఇస్రో రూపొందించిన ఆరు రకాల రాకెట్ సిరీస్‌లలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్ మాత్రమే ప్రయివేట్ సంస్థలకు అప్పగించబోతున్నారన్న మాట.
Comments
Please login to add a commentAdd a comment