బొల్లారం: అసలే ఇది వర్షాకాలం... మన ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో.. మన జీవనంలో భాగమై, కోరుకున్న గమ్యానికి మనల్ని చేర్చే వాహనాల విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వాహన రంగ నిపుణులు. బండే కదా పోనిద్దూ.. అనుకుని వర్షంలో తడిసేలా ఎక్కడబడితే అక్కడ నిలిపితే వ్యయప్రయాసలు తప్పవంటున్నారు.
విడి భాగాలు దెబ్బతింటే..
వాహనాలను చాలామంది రోడ్లపై, వీధుల్లో, ఇళ్లమధ్య సందుల్లో, పార్కులు, చెట్ల కింద ఎక్కువగా నిలుపుతుంటారు. వర్షాల సమయంలో తగి న రక్షణ లేనందున కొద్దిరోజులకే అవి మొరాయిస్తుంటాయి. దాంతో మెకానిక్‌ల వద్దకు తీసుకెళ్తే వర్షంలో తడిసి, కొన్ని విడిభాగాలు దెబ్బతిన్నా యని, వాటిని వెంటనే మార్చాలని చెబుతారు. వాటి ధరలూ ఎక్కువగానే ఉంటున్నాయి. ఆదే విధంగా ద్విచక్ర వాహనం ఇంజిన్ వేడికి స్పార్క్ ప్లగ్‌పై ఉన్న ప్లాస్టిక్ భాగానికి చిన్నపాటి పగుళ్లు ఏర్పడినా, కరెంటు వైరింగ్ కిట్టులో అతుకులు ఎక్కువగా ఉన్నా వాహనాలు తడిసిన సమయంలో ఇబ్బందులు తప్పవు. అరిగిపోయిన తాళాలను వినియోగించడం సరికాదు. బండి సీటు కవరు సరిగా లేకపోతే వర్షపు నీరు ఫిల్టర్‌లోకి వెళ్తుంది. వర్షాకాలం వచ్చేసరికి స్పార్క్ ప్లగ్, వైరింగ్ కిట్టు, సీటు కవరు వంటివి పరిశీలించుకోవాలి. నాణ్యతతో కూడిన అసలు విడిభాగాలనే వాడాలి.
తడిస్తే ఇలా చేయాలి..
వానలో బండి తడిస్తే దానిని బాగా తుడిచి కనీసం అరగంటసేపు ఎండలో ఆరబెట్టాలి. చాలా మంది బండి తడిసిందికదా.. అని అదే పనిగా కిక్ కొడుతూ కిందకూ పైకి కదిలిస్తుంటారు. దీనివల్ల వాహనంలోని సున్నిత భాగాలు, తీగలు, క్లిప్పులు ఊడిపోయి మరో సమస్య తలెత్తవచ్చు. స్పీడో మీటరు, డిజిటల్ మీటర్లోకి నీరు చేరకుండా ఎప్పటి కప్పుడు కవర్లు కప్పుతుండాలి. అసలు విడిభాగాలను వాడాలి. – వెంకటేశ్వర్లు, బైక్ మెకానిక్, తిరుమలగిరి
తడిస్తే ఇలా చేయాలి..
వానలో బండి తడిస్తే దానిని బాగా తుడిచి కనీసం అరగంటసేపు ఎండలో ఆరబెట్టాలి. చాలా మంది బండి తడిసిందికదా.. అని అదే పనిగా కిక్ కొడుతూ కిందకూ పైకి కదిలిస్తుంటారు. దీనివల్ల వాహనంలోని సున్నిత భాగాలు, తీగలు, క్లిప్పులు ఊడిపోయి మరో సమస్య తలెత్తవచ్చు. స్పీడో మీటరు, డిజిటల్ మీటర్లోకి నీరు చేరకుండా ఎప్పటి కప్పుడు కవర్లు కప్పుతుండాలి. అసలు విడిభాగాలను వాడాలి. – వెంకటేశ్వర్లు, బైక్ మెకానిక్, తిరుమలగిరి
లోపాలు గుర్తించండిలా...
♦ వాహనం వానలో తడిస్తే ముందుగా ఎక్సలేటర్ పైపుల ద్వారా కార్బేటర్‌లోకినీరు చేరుతుంది. దాంతో స్టార్టింగ్ సమస్యలు తలెత్తుతాయి.
♦ స్విచ్‌ల్లో నీరు చేరితే... హెడ్ లైట్లు, హారన్, స్టార్టింగ్‌లో ఇబ్బందులు ఎదురవుతాయి.
♦ బ్రేక్ డ్రమ్‌లోకి నీరు వెళితే బ్రేకులు సరిగా పడవు. దాంతో బండి నియంత్రణ మన చేతిలో ఉండదు.
♦ బ్యాటరీలో నీరు చేరితే హారన్,స్టార్టింగ్ సమస్యలు అధికంగా ఉంటాయి.
♦ వర్షంలో ప్రయాణించేటప్పుడు టైర్ల అరుగుదలతో జారిపడే ప్రమాదం ఉంటుంది.
♦ స్టార్టింగ్ కాయిల్, స్పార్క్ ప్లగ్, కార్బేటర్‌లో నీరు చేరినా బండి మొరాయిస్తుంది.
♦ ఒక్కోసారి సైలెన్సర్‌లోకి నీరు వెళ్లినా బండి స్టార్ట్ కాదు.
♦ పెట్రోలు ట్యాంకుపై కవరు ఉంచడం మంచిది. లేకపోతే నీరు ట్యాంకులోకి చేరే అవకాశం ఉం ది. ఇది మరీ ప్రమాదమని గుర్తుంచుకోవాలి.
♦ నీరు చేరి ఎలక్ట్రిక్ వైర్లు తుప్పుపట్టి పాడవుతాయి.
♦ వెనక చక్రం డ్రమ్‌లోకి నీరు చేరితేబండి ఎంతకూ కదలకపోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment