
సాక్షి,రామకుప్పం( చిత్తూరు): శుభ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా టాటాఏస్ బోల్తా పడి ఆరుగురు గాయపడిన ఘటన బుధవారం రామకుప్పం మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటశివకుమార్ కథనం.. దేవరాజపురానికి చెందిన పలువురు కుప్పం మండలం చందం గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యంలో పాల్గొనేందుకు టాటాఏస్ వాహనంలో వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో ఆరివనుపెంట వద్ద టాటాఏస్ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో దేవగి(62), జగన్నాథ్ (52), కనగ(45), కోమది(45), ప్రశాంత్(14), రాహుల్ (12) తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఐ వెంకటశివకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని 108లో క్షతగాత్రులను కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. జగన్నాథ్, కోమది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment