
సాక్షి, నల్గొండ: పోలీసుల కళ్లుగప్పి సీఐ వాహనాన్నే ఎత్తుకెళ్లిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మిర్యాలగూడ టౌన్ ఈదులగూడ సర్కిల్ వద్ద రూరల్ సీఐ రమేష్ బాబు పోలీస్ వాహనం చోరికి గురైంది. గురువారం అర్ధరాత్రి మద్యం సేవిస్తున్న నలుగురు యువకులను సీఐ విచారిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి ఓ యువకుడు సీఐ వాహనంతో కోదాడ వైపు పరారయ్యారు. ఈ క్రమంలో ఎదరుగా వస్తున్న వాహనాన్ని పోలీస్ వాహనం ఢీకొనడంతో కారు ముందు భాగం ధ్వంసమయ్యింది. దీంతో పోలీసులు చేజింగ్ చేసి ఆలగడప టోల్‌గేట్ వద్ద వాహనాన్ని రూరల్ ఎస్‌ఐ పరమేష్ పట్టుకున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment