హైబ్రిడ్ రకాలతో మంచి ఫలితాలు
- యాంత్రీకరణ కూడా అవసరం
- పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కార్యక్రమాల వివరణ
- జెడ్‌ఆర్‌ఈఏసీ సమావేశాలు ప్రారంభం
అనకాపల్లి, న్యూస్‌లైన్: అధిక వర్షాలను తట్టుకోగలిగే ఎంటీయూ 1121 వరివంగడం ఉపయోగించుకోవాలని, హైబ్రిడ్ రకాలతో మంచి ఫలితాలు వస్తాయని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ వర్సిటీ డీన్ టి.రమేష్‌బాబు సూచించారు. అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం జూబ్లీ హాల్లో సోమవారం నుంచి 2013-14 ఖరీఫ్, రబీ సీజన్‌కు సంబంధించిన ఉత్తర కోస్తా మండలి పరిశోధనా, విస్తరణ సలహా మండలి సమావేశాలు మొదలయ్యా యి.
ఏడీఆర్ కె.వీరభద్రరావు అధ్యక్షతన జరిగి న ఈ సమావేశాలను జిల్లా వ్యవసా య శాఖ సంయుక్త సంచాలకులు ఎన్.సి.శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసిన లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన రమేష్‌బాబు మా ట్లాడుతూ జిల్లాలో యాంత్రీకరణ చా లా తక్కువగా ఉందని తెలిపారు. డ్ర మ్ సీడర్, శ్రీవరి సాగు వల్ల అధిక దిగుబడులు వస్తున్నందున ఆ పద్ధతులనే అవలంబించాలని సూచించారు.
మొ క్కజొన్న, పొద్దు తిరుగుడు, నువ్వు సా గు చేసినప్పుడు అవి భూమి నుంచి ఎక్కువ పోషకాలు తీసుకుంటాయని చెప్పారు. దీని వల్ల అనంతరం సాగుచేసే వరిలో దిగుబడులు తగ్గుతాయని చెప్పారు. చిరుధాన్యాల సాగును ప్రో త్సహించాలని, హైబ్రీడ్ వరి, హైబ్రీడ్ చెరకుపై పరిశోధనలు జరగాలని పరిశోధనా విభాగానికి సూచించారు. పత్తిలో మొక్కల సాంధ్రత ఎక్కువ చే యడం ద్వారా అధిక దిగుబడులు సా ధించవచ్చన్నారు. వరిలో ఇనుము, జింక్ ధాతువులను చొప్పించడం ద్వా రా ఆరోగ్యవంతమైన వరి మనకు లభిస్తుందని చెప్పారు.
టీబీజీ 104 అనే మినుము రకం కూడా పల్లాకు తెగులును తట్టుకుంటుందని చెప్పారు. వి శిష్ట అతిథిగా విచ్చేసిన నైరా వ్యవసా య కళాశాల అసోసియేట్ డీన్ ఎ.సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ సా గు ఖర్చులు తగ్గించుకుని వ్యవసా యం చేయాలని రైతులకు పిలుపుని చ్చారు. ఉత్తర కోస్తా భూముల్లో భాస్వ రం అధికంగా ఉన్నందున ఎరువులు తక్కువగా వినియోగించాలని సూచిం చారు. విత్తన శుద్ధి, రసాయన కలుపు మందులు వాడడం వల్ల కూలీల కొరతను అధిగమించవచ్చని చెప్పారు.
వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు శ్రీనివాస్ మాట్లాడుతూ వరి విస్తీర్ణం రోజుకు రోజుకూ పెరుగుతోందని, అధిక వర్షాల వల్ల దిగుబడులు బాగా పడిపోయాయని పేర్కొన్నారు. పంటల్లో పురుగులు, తెగుళ్ల బాధలు అధికంగా ఉన్నాయని, తక్కు వ కాలపరిమితి కలిగిన రకాలను, నీటి ఎద్దడిని తట్టుకునే రకాలను వినియోగించాలని కోరారు. విజయనగరం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సం చాలకులు జి.లీలావతి మాట్లాడుతూ మొక్కజొన్న గింజలు ఎండబట్టే డ్రయ ర్స్ రావాలని ఆకాంక్షించారు.
బయోఫెర్టిలైజర్స్‌ను ఉపయోగంలోకి తీసుకురావాలని కోరారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జేడీ తరపున విచ్చేసిన కె.రామారావు మాట్లాడుతూ గత ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవన్నారు. వరిలో ఎకరానికి 15 బస్తాల దిగుబడి రావడంతో రైతులు నష్టపోయారని చెప్పారు.
అంతకుముందు ఏడీఆర్ కె.వీరభద్రరావు ఉత్తర కోస్తా మండలంలో గత సంవత్సరం చేపట్టిన పరిశోధనలు, విస్తరణ కార్యక్రమాలను పవర్ పా యింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిం చారు. ముందుగా చెరకు ప్రధాన శాస్త్రవేత్త కె.ప్రసాదరావు సమావేశంలోని సభ్యులను ఆహ్వానించారు. ఈ సమావేశంలో మూడు జిల్లాలకు చెందిన ఏరువాక కేంద్రం ప్రతినిధు లు, వ్యవసాయ శాఖ అధికారులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.