వేసవిలో కూరగాయల కొరత సహజంగా ఏర్పడుతుంది. అప్పుడు ధరలు పెరగడం ప్రతి ఏటా సర్వసాధారణం. వేసవికి మార్కెట్‌లోకి కూరగాయలు మార్కెట్‌లోకి వచ్చే విధంగా సాగు చేసుకుంటే నికరాదాయాన్ని పెంచుకోవచ్చు.
హైబ్రిడ్ కూరగాయల సాగుకు అదును
Published Fri, Jan 27 2017 1:06 AM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM
– విత్తన మోతాదు పెంచుకోవాలి
– మొక్కల సాంద్రత పెరిగితేనే లాభం
– ఉద్యాన శాఖ ఏడీ రఘునాథరెడ్డి సూచనలు
కర్నూలు(అగ్రికల్చర్): వేసవిలో కూరగాయల కొరత సహజంగా ఏర్పడుతుంది. అప్పుడు ధరలు పెరగడం ప్రతి ఏటా సర్వసాధారణం. వేసవికి మార్కెట్‌లోకి కూరగాయలు మార్కెట్‌లోకి వచ్చే విధంగా సాగు చేసుకుంటే నికరాదాయాన్ని పెంచుకోవచ్చు. ప్రస్తుత వాతావరణానికి తగినట్లుగా అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్(సంకర జాతి) వంగడాలను ఎన్నుకోవడం అవసరమని ఉద్యానశాఖ ఏడీ రఘునాథరెడ్డి(79950 86793) పేర్కొన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే...
మొక్కల సాంద్రత పెంచుట...
రబీలో అధిక ఉష్ణోగ్రత కారణంగా మొక్కల పెరుగుదల తక్కువగా ఉంటుంది. పూత, పిందె తగ్గి, దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల మొక్కలను దగ్గరదగ్గరగా తక్కువ దూరంలో నాటుకుని మొక్కల సాంద్రత పెంచితే ఒక మొక్క ద్వారా దిగుబడి తగ్గినప్పటికీ ఎక్కువ సంఖ్యలో మొక్కలు ఉండటం వల్ల నిర్ణీత విస్తీర్ణంలో దిగుబడి తగ్గకుండా ఉంటుంది. వేసవిలో కూరగాయలు సాగు చేసే రైతులు విత్తన మోతాదును పెంచాలి.
మొక్కల మధ్య దూరం..
టమటాలో మొక్కల మధ్య దూరంలో 40 ఇంటు 30 సెంటీమీటర్లు ఉండాలి. ఎకరాకు 250 గ్రాముల విత్తనం అవసరం. వంగలో మొక్కల మధ్య దూరం 60 ఇంటు 45 సెంటీమీటర్లు ఉండాలి. ఎకరాకు 300 గ్రాముల విత్తనం అవసరం. బెండలో 45 ఇంటు 20 సెంటీమీటర్లు మొక్కల మధ్య దూరం ఉండాలి. ఎకరాకు 8 కిలోల విత్తనాలు అవసరం. పచ్చి మిరపలో 45 ఇంటు 45 ప్రకారం మొక్కల మధ్య దూరం ఉండాలి. 650 గ్రాముల విత్తనాలు అవసరమవుతాయి. బీరలో 1.5 ఇంటు 0.5 మీటర్ల మేర మొక్కల మధ్య దూరం ఉండాలి. ఎకరాకు 2 కిలోల విత్తనాలు అవసరం అవుతాయి. కాకరలో 1.5 ఇంటు 0.5 మీటర్లు మొక్కల మధ్య దూరం ఉండాలి. ఎకరాకు 2 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. కాకరలో 1.5 ఇంటు 0.5 మీటర్లు మొక్కల మధ్య దూరం ఉండాలి. ఎకరాకు 2 కిలోల విత్తనాలు అవసరమవుతాయి.
జాగ్రత్తలు అవసరం..
– సాధ్యమైనంత ఎక్కువ మోతాదులో సేంద్రియ ఎరువులు వాడితే భూమిలో తేమను పట్టి ఉంచే గుణం పెరగటమే కాక సూక్ష్మ జీవుల చర్య పెరిగి పోషకాల లభ్యత పెరుగుతుంది.
– జీవన ఎరువులైన అజటోబాక్టర్, ఫాప్పొ బాక్టీరియా ఎకరానికి 2 కిలోల చొప్పున వాడితే సిఫారసు చేసిన నత్రజని, భాస్వరం ఎరువులు 25 శాతం ఆదా చేయవచ్చు.
– మొక్క పెరుగుదల దశలో అంటే 30, 45, 75 రోజులకు 2 శాతం యూరియా ద్రావణాన్ని పైరుపై పిచికారీ చేస్తే నత్రజని ఆదాతో పాటు నీటి ఎద్దడిని తట్టుకునే వీలుంటుంది.
– ప్రతి 9 కిలోల యూరియాకు ఒక కిలో వేప పిండి లేదా 25 కిలో యూరియాకు ఒక కిలో వేపనూనె కలిపి అరగంట సేపు ఆరబెట్టి వేస్తే ఎంత వేడికైనా యూరియా ఆవిరి కాకుండా ఎక్కువ కాలం మొక్కకు అందుబాటులో ఉంటుంది.
– రబీలో టమాటలో కాయ పగుళ్లు, సైజు తగ్గడం, కాయ కింద కుళ్లు మొదలైన సమస్యలు బోరాన్, కాల్షియం లోపం వల్ల వస్తాయి. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి పూత, పిందె దశలో రెండు సార్లు వారం వ్యవధిలో పిచికారీ చేయాలి. కాయ కింద కుళ్లు నివారణకు కాల్షియం నైట్రేటు 5 గ్రాముల చొప్పున లీటరు నీటికి కలిపి పూతకు ముందు పిచికారీ చేయాలి.
ప్రభుత్వ చేయూత...
రబీలో కూరగాయల సాగుకు డ్రిప్ సౌకర్యం కల్పించుకోవాలి. ఇందుకు ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం సబ్సిడీ, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ ఉంది. ట్రైల్లీస్ పద్ధతిలో టమాట సాగు చేసుకోవడానికి రాయితీ లభిస్తుంది. కూరగాయల పంటల సాగుకు మల్చింగ్ సౌకర్యం కల్పించుకోవాలి. మల్చింగ్ ఏర్పరచుకునేందుకు 50 శాతం రాయితీ లభిస్తుంది.
Advertisement
Advertisement