టెక్ దిగ్గజం యాపిల్ కొత్త ప్రొడక్ట్‌లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఏటా నిర్వహించే వరల్ట్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (WWDC 2023)లో తమ ప్రొడక్ట్స్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఈ ఏడాది జూన్ 5 (రేపటి నుంచే) సోమవారం నుంచి జూన్ 9 శుక్రవారం వరకు ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు యాపిల్ వెల్లడించింది.
యాపిల్ ఆవిష్కరించే ప్రొడక్ట్స్ ఇవేనా
ఐదు రోజుల డెవలపర్ ఈవెంట్‌లో ప్రీమియం ప్రొడక్ట్‌లైన మిక్స్‌డ్ రియాలిటీ (ఎంఆర్)హెడ్‌సెట్, న్యూ మాక్‌బుక్ ఎయిర్, కొత్త ఆపరేటింగ్ సిస్టంను విడుదల చేయనుంది. దీంతో పాటు వర్చువల్ రియాలిటీ (వీఆర్), అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్)ను అనుభూతి పొందేందుకు వినియోగించే మిక్స్‌డ్ రియాలిటీ హెడ్ సెట్ కోసం గత కొంత కాలంగా నిరీక్షిస్తున్న యూజర్లు కోరిక నెరవేరనుంది.
ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది?
కాలిఫోర్నియాలోని కుపెర్టినో యాపిల్ పార్క్ కేంద్రంగా జరిగే ఈ ఈవెంట్‌కు డెవలపర్‌లు, విద్యార్థులు పాల్గొననున్నారు. భారతీయులు స్థానిక కాలమానం ప్రకారం జూన్ 5 (సోమవారం) రాత్రి 10:30 గంటలకు వీక్షించవచ్చు.
ఎలా వీక్షించాలి?
వరల్ట్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్‌ను యాపిల్ డాట్‌కామ్‌లో లైవ్ స్ట్రీమ్ జరగనుంది. యాపిల్ టీవీ సబ్‌స్క్రిప్షన్ ఉంటే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి లైవ్‌లో చూడొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment