ఈ ఆధునిక ప్రపంచంలో మానవుడు తన లైఫ్ స్టైల్‌ని, కంఫర్ట్ లెవల్స్‌ను పెంచుకోవడానికి ఎన్నో గొప్పగొప్ప ఇన్వెన్షలను అభివృద్ది చేశాడు. ఉదాహరణకు ఒకప్పుడు మాట్లాడానికి ఉపయోగపడే సెల్ ఫోన్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌గా మారి మనిషి జీవన శైలిని పూర్తిగా మార్చేసింది. కరోనా పుణ్యమా అంటూ డిజిటల్ కొలాబరేషన్ పెరిగి స్మార్ట్ ఫోన్ అవసరాన్ని మరింత పెంచేసింది. అందుకే ఆయా టెక్నాలజీ సంస్థలు స్మార్ట్ ఫోన్‌లలో కొత్త కొత్త టెక్నాలజీలను డెవలప్ చేస్తున్నాయి. తాజాగా టెక్ దిగ్గం యాపిల్ తన ఐఫోన్‌లో మరో కొత్త టెక్నాలజీని అందుబాటులో తీసుకొని రానుంది.
యూఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ అధికారిక పోర్టల్ వివరాల ప్రకారం.. యాపిల్ సంస్థ ఐఫోన్ ఫంక్షనాలిటీని పూర్తిగా మార్చనుంది. ఇప్పటి వరకు ఐఫోన్ స్క్రీన్‌ను యాప్స్, కాంటాక్ట్స్,యాప్‌స్టోర్, పాడ్‌కాస్ట్ వినేందుకు ఉపయోగించేవాళ్లం. కానీ ఇకపై ఐఫోన్ స్క్రీన్‌ను బ్యాటరీ ఛార్జర్‌గా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ట్రాన్సాఫార్మ్ చేస్తున్నట్లు తెలిపింది. ఒకవేళ టిమ్ కుక్ ఈ టెక్నాలజీని ఐఫోన్‌లలో అప్‌డేట్ చేస్తే యాపిల్‌కు చెందిన గాడ్జెట్స్‌ను ఐఫోన్ మీద ఉంచి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అయితే ఈ కొత్త టెక్నాలజీపై ఐఫోన్ యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. ఈ కొత్త టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో టెక్ నిపుణులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.
'థ్రూ డిస్‌ప్లే వైర్‌లెస్ ఛార్జింగ్' ఫీచర్ సాయంతో కొన్ని యాక్ససరీస్‌కు డిస్ ప్లే ద్వారా ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు. వాటిలో యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, ఐపాడ్, ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచ్‌లకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చని' చెబుతున్నారు.
ఈ ఫీచర్ ఎందుకు ఉపయోగపడుతుంది
యూజర్లు యాపిల్ గాడ్జెట్స్‌కు సంబంధించిన ఛార్జర్లు మరిచిపోయినప్పుడు ఈ డిస్‌ప్లే వైర్‌లెస్ ఛార్జింగ్‌ను వినియోగించుకోవచ్చు. ఐపాడ్, ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచ్‌లను ఐఫోన్ పై పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కాగా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే యాపిల్ ప్రొడక్ట్‌లు వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
చదవండి: ఐఫోన్‌లలో అదిరిపోయే ఫీచర్, సిమ్‌కార్డ్‌తో పనిలేకుండా..!
Comments
Please login to add a commentAdd a comment