ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ గుడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో తొలి రిటైల్ స్టోర్ ‘యాపిల్ బీకేసీ’ (Apple BKC) ను ఏప్రిల్ 18న వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది.
బ్లూమ్ రిపోర్ట్ నివేదిక ప్రకారం.. యాపిల్ సీఈవో టిమ్‌కుక్ ఏప్రిల్ 18న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌లో ఉదయం 11 గంటలకు భారత్‌లో తొలి అధికారిక రిటైల్ స్టోర్ ప్రారంభించనున్నారు.
రెండ్రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 20 ఉదయం 10 గంటలకు ఢిల్లీ సాకెట్‌లోని సెలెక్ట్ సిటీవాక్ మాల్‌లో యాపిల్ రిటైల్ స్టోర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు నివేదిక పేర్కొంది.
లాస్ ఎంజెల్స్,న్యూయార్క్, బీజింగ్, మిలాన్, సింగ్‌పూర్ దేశాల తరహాలోనే ముంబైలోని యాపిల్ బీకేసీ రీటైల్ స్టోర్ 22,000 చదరపు అడుగుల్లో నిర్మించినట్లు తెలుస్తోంది. దీంతో యాపిల్ సంస్థ రీటైల్ స్టోర్‌ల సంఖ్య 25 దేశాల్లో 552కి చేరినట్లైంది.
Comments
Please login to add a commentAdd a comment