ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న చర్యలపై ప్రపంచ దేశాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. నెటిజన్లు సైతం సోషల్ మీడియా వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక హ్యాకర్లు సైతం తమ సొంత దేశమైన రష్యా తీరును విమర్శిస్తూ హ్యాకర్స్ సైబర్ దాడులు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా కీలక నిర్ణయం తీసుకుంది. మెటా పరిధిలోని ఫేస్‌బుక్‌లో రష్యన్ మీడియాకు సంబంధించిన అడ్వెర్‌టైమెంట్లును జ్‌నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఫేస్‌బుక్‌తో పాటు టెక్ దిగ్గజం యాపిల్ తన కార్యకలాపాల్ని రష్యాలో నిషేధం ఉక్రెయిన్ ఉపాధ్యక్షుడు,డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మంత్రి మైఖైలో ఫెడోరోవ్ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కు లేఖ రాశారు.
ప్రపంచమంతా ఆంక్షలు విధిస్తూ రష్యా తీరును ఎండగడుతోంది. శత్రువు గణనీయమైన నష్టాలను చవి చూడాలి. అందుకు మీ మద్దతు కావాలి. అందుకే యాప్ స్టోర్‌ను నిషేధించాలని కోరుతున్నామని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలాంటి చర్యల వల్ల రష్యన్ ప్రజలు అక్కడి యువత ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దురాక్రమణను అడ్డుకుంటాయని భావిస్తున్నాం. ఈ దాడిని అడ్డుకోవాలని రష్యన్ ప్రజలకు మైఖైలో ఫెడోరోవ్ విజ్ఞప్తి చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment