Apple Work From Home End Latest Updates: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ వర్క్ ఫ్రమ్ హోమ్ పై కీలక ప్రకటన చేసింది. కరోనా కారణంగా వర్క్ హోమ్ కే పరిమితమైన ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే యాపిల్ వర్క్ ఫ్రమ్ చేస్తున్న ఉద్యోగుల్ని కార్యాలయానికి రావాలని పలుమార‍్లు మెయిల్స్ పంపింది. కానీ కోవిడ్ వల్ల ఆఫీస్‌లో వర్క్ చేసే విషయాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చింది. తాజాగా యాపిల్ మరోసారి ఉద్యోగులకు డెడ్ లైన్ విధించింది.
ఫిబ్రవరి 1 నుంచే
ఫిబ్రవరి 1 నుంచి ఉద్యోగులందరూ తిరిగి కార్యాలయాల నుంచి పనిచేయాలని యాపిల్ స్పష్టం చేసింది. అంతకుముందు జనవరి 22 నుంచి ఉద్యోగులంతా ఆఫీసులకు రావాలని కంపెనీ కోరగా తాజాగా దీన్ని ఫిబ్రవరి 1కి పొడిగించారు. తాజా సమాచారం ప్రకారం.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తన ఉద్యోగులకు కొత్త వర్క్ ప్లాన్ గురించి మెయిల్ చేసినట్లు తెలుస్తోంది.
మెయిల్ గురించి వచ్చిన కథనాల ఆధారంగా..ఉద్యోగుల్ని దశలవారీగా ఆఫీస్‌లకు రావాలని టిమ్ కుక్ మెయిల్‌లో పేర్కొన్నారు. ఉద్యోగులు వారానికి రెండు రోజులు మాత్రమే ఆఫీస్‌లో పనిచేయాలని సూచించారు. ఈ వర్క్‌ప్లాన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి1 నుంచి కొనసాగుతుంది. ప్లాన్‌లో భాగంగా ఉద్యోగులు వారానికి కనీసం 3రోజులుమూడు రోజులు సోమవారం,మంగళవారం, గురువారం ఆఫీస్‌కు రావాలని తెలిపారు. బుధవారం,శుక్రవారం ఇంటి నుంచి పనిచేసేందుకు టిమ్ కుక్ అనుమతి ఇచ్చారు.
చదవండి: విమాన ప్రమాదం, తండ్రి - కూతురు ప్రాణాలు కాపాడిన ఐపాడ్..!
Comments
Please login to add a commentAdd a comment