Apple Event 2022: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ టెక్ లవర్స్ సస్పెన్స్‌కు తెరదించింది. మంగళవారం జరిగిన యాపిల్ ఈవెంట్‌లో తన కొత్త ప్రొడక్ట్‌లను లాంఛ్ చేసింది. యాపిల్ పీక్ పర్ఫామెన్స్ 2022 పేరిట జరిపిన ఈవెంట్‌లో యాపిల్ నాలుగు కొత్త ప్రొడక్ట్‌లను విడుదల చేసింది. ఇందులో యాపిల్ ఏ15 బయోనిక్ చిప్‌సెట్‌తో 5జీ ఐఫోన్ ఎస్‌ఈ, ఎం1 చిప్‌తో ఐపాడ్ ఎయిర్, హైబ్రిడ్ డివైజ్ పేరుతో డిస్‌ప్లేతో పనిచేసే మాక్ స్టూడియో డివైజెస్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది.
యాపిల్ ఐఫోన్13
యాపిల్ ఈవెంట్ సందర్భంగా యాపిల్ ఐఫోన్13 రెండు వేరియంట్ కలర్స్‌ను ప్రకటించింది. అందులో ఐఫోన్13 కోసం గ్రీన్, ఐఫోన్ 13 ప్రో కోసం ఆల్పైన్ గ్రీన్ తో విడుదల చేస్తున్నట్లు తెలిపింది.
ఏ15 బయోనిక్ చిప్‌సెట్‌తో ఐఫోన్‌ఎస్‌ఈ
యాపిల్ ఈ మెగా ఈవెంట్‌లో బయోనిక్ చిప్ సెట్‌తో ఐఫోన్ ఎస్‌ఈ ప్రకటించింది. ఈ సందర్భంగా అన్నీ ధరల్లో ఉన్న అన్నీ స్మార్ట్ ఫోన్‌ల కంటే ఏ15 బయోనిక్ చిప్ సెట్ చాలా ఫాస్ట్‌గా పనిచేస్తున్నట్లు యాపిల్ పేర్కొంది. కొత్త ఐఫోన్ ఎస్‌ఈలో గ్రాఫిక్స్ పనితీరు ఇటీవల విడుదలైన ఐఫోన్13 సిరీస్ ఫోన్‌తో సమానంగా పనిచేస్తుందని వెల్లడించింది. ఇక ఈ కొత్త ఐఫోన్ ఎస్‌ఈ రెడ్, వైట్,బ్లాక్ కలర్స్ వేరియంట్‌తో గాజు, అల్యూమినియం డిజైన్‌ను కలిగి ఉంది.
ఐఫోన్13, ఐఫోన్13 ప్రో మాదిరిగానే ఐఫోన్ ఎస్‌ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్ట్రాంగ్ గ్లాస్ ఉండగా..స్మార్ట్‌ఫోన్ మునుపటి డిజైన్‌ల నుండి హోమ్ బటన్‌ను కలిగి ఉందని ఈవెంట్‌లో స్పష్టం చేసింది. దీంతో పాటు బ్యాటరీ లైఫ్ మెరుగుపడిందని పునరుద్ఘాటించింది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ధర 429 (ఇండియన్ కరెన్సీలో రూ.32,953.21)డాలర్లు.
ఐపాడ్ ఎయిర్
యాపిల్ కొత్త ఎం1 చిప్‌తో ఐపాడ్ ఎయిర్ను విడుదల చేసింది. తద్వారా యూజర్లు భారీ ప్రొక్రియేట్ ప్రాజెక్ట్‌లను ఈజీగా చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాదు ట్రెండింగ్‌లో ఉన్న గేమ్స్ ను ఈజీగా ఆడుకోవచ్చని సూచించింది. ఐపాడ్ ఎయిర్‌లోని ఫ్రంట్ కెమెరా సరికొత్త 12ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాతో అప్‌గ్రేడ్ చేసింది. ఇది యాపిల్ సెంటర్ స్టేజ్ టెక్నాలజీకి సపోర్ట్ ఇస్తుంది.
5జీ నెట్ వర్క్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తున్న ఐపాడ్ ఎయిర్ స్మార్ట్ కీబోర్డ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇందులో యాపిల్ సెకండ్ జనరేషన్ పెన్సిల్ తోపాటు కొత్త ఐపాడ్ ఓఎస్ 15ఫీచర్లు ఉన్నాయి. కొత్త ఐపాడ్ ప్రారంభ ధర 599డాలర్లు( ఇండియన్ కరెన్సీలో రూ.46,025.06గా) ఉంది. మార్చి18నుంచి ఈ ప్రొడక్ట్‌ను ఆన్‌లైన్‌లో సేల్‌కు ఉంచనుంది.
ఎం1 ఆల్ట్రా చిప్
యాపిల్ ఎం1 అల్ట్రా అనే చిప్‌ని పరిచయం చేసింది. యాపిల్ ఎం1 మ్యాక్స్ ఇప్పటి వరకు అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్. అయితే తాజాగా యాపిల్ ఎం1 ఆల్ట్రా చిప్ ను తెచ్చింది. ఈ చిప్ పనితీరును మరింత పెంచేందుకు అల్ట్రాఫ్యూజన్ టెక్నాలజీని వినియోగిస్తుంది.
ఎం1 అల్ట్రాతో భారీ బ్యాండ్‌విడ్త్, శక్తి సామర్థ్యాన్ని అందిస్తుంది. ఎం1 చిప్ కంటే ఎనిమిది రెట్లు వేగంగా పని చేస్తుంది. 20-కోర్ సీపీయూ, 64-కోర్ జీపీయూని కలిగి ఉంది. ఎం1 అల్ట్రా 90శాతం తక్కువ శక్తిని ఉపయోగిస్తున్నప్పుడు తోటి 16-కోర్ సీపీయూల కంటే ఎక్కువ శక్తిని అందిస్తుంది.
మాక్ స్టూడియో.. మాక్ డిస్‌ప్లే
సాధారణంగా యాపిల్ మాక్ మిని ఫారమ్ ఫ్యాక్టర్‌లో ఎం1 అల్ట్రా పనితీరును ఏకీకృతం చేసింది. ఈ పోర్టబుల్ సీపీయూని స్టూడియో డిస్‌ప్లేతో ఉపయోగించవచ్చు, మాక్ స్టూడియో కనెక్టివిటీ కోసం బహుళ పోర్ట్‌లతో వస్తుంది. ఇది ఒకే సమయంలో గరిష్టంగా నాలుగు డిస్‌ప్లేలతో కనెక్ట్ చేయగలదు.
మాక్ స్టూడియో పెద్ద ఎం1 చిప్‌లతో వస్తుంది. ఎం1 మ్యాక్స్ తో సహా మాక్ ప్రోని కూడా అధిగమిస్తుంది. అదనంగా ఎం1 అల్ట్రాతో కూడిన మాక్ స్టూడియో 26-కోర్ సీపీయూతో మాక్ ప్రో కంటే 60శాతం కంటే ఫాస్ట్‌గా పనిచేస్తుంది. ఎం1 మ్యాక్స్ మాక్ స్టూడియో 64జీబీ యూనిఫైడ్ మెమరీతో వస్తుంది. ఎం1 ఆల్ట్రా మ్యాక్స్ స్టూడియో 128జీబీ మెమరీతో వస్తుంది.
స్టూడియో డిస్‌ప్లే అల్యూమినియం ఛాసిస్‌తో కూడిన ఆల్ డిస్‌ప్లే డిజైన్‌ను కలిగి ఉంది. స్టూడియో డిస్‌ప్లే 27-అంగుళాల డిస్‌ప్లే, 600 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్,బిలియన్ కంటే ఎక్కువ కలర్స్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది యాపిల్ ట్రూ టోన్‌కు మద్దతు ఇస్తుంది. యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్‌తో వస్తుంది
Comments
Please login to add a commentAdd a comment