Apple iPhone SE
-
యాపిల్ ఈవెంట్: టెక్ లవర్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కొత్త ప్రొడక్ట్‌లు!!
Apple Event 2022: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ టెక్ లవర్స్ సస్పెన్స్‌కు తెరదించింది. మంగళవారం జరిగిన యాపిల్ ఈవెంట్లో తన కొత్త ప్రొడక్ట్‌లను లాంఛ్ చేసింది. యాపిల్ పీక్ పర్ఫామెన్స్ 2022 పేరిట జరిపిన ఈవెంట్లో యాపిల్ నాలుగు కొత్త ప్రొడక్ట్‌లను విడుదల చేసింది. ఇందులో యాపిల్ ఏ15 బయోనిక్ చిప్సెట్తో 5జీ ఐఫోన్ ఎస్ఈ, ఎం1 చిప్‌తో ఐపాడ్ ఎయిర్, హైబ్రిడ్ డివైజ్ పేరుతో డిస్ప్లేతో పనిచేసే మాక్ స్టూడియో డివైజెస్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. యాపిల్ ఐఫోన్13 యాపిల్ ఈవెంట్ సందర్భంగా యాపిల్ ఐఫోన్13 రెండు వేరియంట్ కలర్స్‌ను ప్రకటించింది. అందులో ఐఫోన్13 కోసం గ్రీన్, ఐఫోన్ 13 ప్రో కోసం ఆల్పైన్ గ్రీన్ తో విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఏ15 బయోనిక్ చిప్సెట్తో ఐఫోన్ఎస్ఈ యాపిల్ ఈ మెగా ఈవెంట్లో బయోనిక్ చిప్ సెట్‌తో ఐఫోన్ ఎస్ఈ ప్రకటించింది. ఈ సందర్భంగా అన్నీ ధరల్లో ఉన్న అన్నీ స్మార్ట్ ఫోన్ల కంటే ఏ15 బయోనిక్ చిప్ సెట్ చాలా ఫాస్ట్‌గా పనిచేస్తున్నట్లు యాపిల్ పేర్కొంది. కొత్త ఐఫోన్ ఎస్ఈలో గ్రాఫిక్స్ పనితీరు ఇటీవల విడుదలైన ఐఫోన్13 సిరీస్ ఫోన్‌తో సమానంగా పనిచేస్తుందని వెల్లడించింది. ఇక ఈ కొత్త ఐఫోన్ ఎస్ఈ రెడ్, వైట్,బ్లాక్ కలర్స్ వేరియంట్‌తో గాజు, అల్యూమినియం డిజైన్‌ను కలిగి ఉంది. ఐఫోన్13, ఐఫోన్13 ప్రో మాదిరిగానే ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్ట్రాంగ్ గ్లాస్ ఉండగా..స్మార్ట్‌ఫోన్ మునుపటి డిజైన్ల నుండి హోమ్ బటన్‌ను కలిగి ఉందని ఈవెంట్లో స్పష్టం చేసింది. దీంతో పాటు బ్యాటరీ లైఫ్ మెరుగుపడిందని పునరుద్ఘాటించింది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ధర 429 (ఇండియన్ కరెన్సీలో రూ.32,953.21)డాలర్లు. ఐపాడ్ ఎయిర్ యాపిల్ కొత్త ఎం1 చిప్‌తో ఐపాడ్ ఎయిర్‌ను విడుదల చేసింది. తద్వారా యూజర్లు భారీ ప్రొక్రియేట్ ప్రాజెక్ట్‌లను ఈజీగా చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాదు ట్రెండింగ్‌లో ఉన్న గేమ్స్ ను ఈజీగా ఆడుకోవచ్చని సూచించింది. ఐపాడ్ ఎయిర్‌లోని ఫ్రంట్ కెమెరా సరికొత్త 12ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాతో అప్‌గ్రేడ్ చేసింది. ఇది యాపిల్ సెంటర్ స్టేజ్ టెక్నాలజీకి సపోర్ట్ ఇస్తుంది. 5జీ నెట్ వర్క్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తున్న ఐపాడ్ ఎయిర్ స్మార్ట్ కీబోర్డ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇందులో యాపిల్ సెకండ్ జనరేషన్ పెన్సిల్ తోపాటు కొత్త ఐపాడ్ ఓఎస్ 15ఫీచర్లు ఉన్నాయి. కొత్త ఐపాడ్ ప్రారంభ ధర 599డాలర్లు( ఇండియన్ కరెన్సీలో రూ.46,025.06గా) ఉంది. మార్చి18నుంచి ఈ ప్రొడక్ట్‌ను ఆన్లైన్లో సేల్కు ఉంచనుంది. ఎం1 ఆల్ట్రా చిప్ యాపిల్ ఎం1 అల్ట్రా అనే చిప్‌ని పరిచయం చేసింది. యాపిల్ ఎం1 మ్యాక్స్ ఇప్పటి వరకు అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్. అయితే తాజాగా యాపిల్ ఎం1 ఆల్ట్రా చిప్ ను తెచ్చింది. ఈ చిప్ పనితీరును మరింత పెంచేందుకు అల్ట్రాఫ్యూజన్ టెక్నాలజీని వినియోగిస్తుంది. ఎం1 అల్ట్రాతో భారీ బ్యాండ్‌విడ్త్, శక్తి సామర్థ్యాన్ని అందిస్తుంది. ఎం1 చిప్ కంటే ఎనిమిది రెట్లు వేగంగా పని చేస్తుంది. 20-కోర్ సీపీయూ, 64-కోర్ జీపీయూని కలిగి ఉంది. ఎం1 అల్ట్రా 90శాతం తక్కువ శక్తిని ఉపయోగిస్తున్నప్పుడు తోటి 16-కోర్ సీపీయూల కంటే ఎక్కువ శక్తిని అందిస్తుంది. మాక్ స్టూడియో.. మాక్ డిస్ప్లే సాధారణంగా యాపిల్ మాక్ మిని ఫారమ్ ఫ్యాక్టర్‌లో ఎం1 అల్ట్రా పనితీరును ఏకీకృతం చేసింది. ఈ పోర్టబుల్ సీపీయూని స్టూడియో డిస్ప్లేతో ఉపయోగించవచ్చు, మాక్ స్టూడియో కనెక్టివిటీ కోసం బహుళ పోర్ట్‌లతో వస్తుంది. ఇది ఒకే సమయంలో గరిష్టంగా నాలుగు డిస్ప్లేలతో కనెక్ట్ చేయగలదు. మాక్ స్టూడియో పెద్ద ఎం1 చిప్‌లతో వస్తుంది. ఎం1 మ్యాక్స్ తో సహా మాక్ ప్రోని కూడా అధిగమిస్తుంది. అదనంగా ఎం1 అల్ట్రాతో కూడిన మాక్ స్టూడియో 26-కోర్ సీపీయూతో మాక్ ప్రో కంటే 60శాతం కంటే ఫాస్ట్‌గా పనిచేస్తుంది. ఎం1 మ్యాక్స్ మాక్ స్టూడియో 64జీబీ యూనిఫైడ్ మెమరీతో వస్తుంది. ఎం1 ఆల్ట్రా మ్యాక్స్ స్టూడియో 128జీబీ మెమరీతో వస్తుంది. స్టూడియో డిస్ప్లే అల్యూమినియం ఛాసిస్‌తో కూడిన ఆల్ డిస్ప్లే డిజైన్‌ను కలిగి ఉంది. స్టూడియో డిస్ప్లే 27-అంగుళాల డిస్ప్లే, 600 నిట్ల వరకు బ్రైట్నెస్,బిలియన్ కంటే ఎక్కువ కలర్స్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది యాపిల్ ట్రూ టోన్‌కు మద్దతు ఇస్తుంది. యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్‌తో వస్తుంది -
ఫాక్స్‌కాన్- భారీ పెట్టుబడి, ఉద్యోగాల బాట!
తైవాన్‌లోని తైపీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఫాక్స్‌కాన్ దేశీయంగా బిలియన్ డాలర్ల(రూ. 7500 కోట్లు)ను ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ ప్రధానంగా కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్ సేవలను అందిస్తుంటుంది. కంపెనీ కస్లమర్లలో యూఎస్ టెక్ దిగ్గజం యాపిల్‌ను ప్రధానంగా పేర్కొనవచ్చు. యాపిల్ తయారీ ఐఫోన్ల అసెంబ్లింగ్‌ను చేపడుతుంటుంది. ఇటీవల యూఎస్, చైనా మధ్య తలెత్తిన వాణిజ్య వివాదాలు, కరోనా వైరస్ తదితర సవాళ్ల నేపథ్యంలో దేశీయంగా తయారీని విస్తరించాలని ఫాక్స్‌కాన్ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు ప్రధానంగా యాపిల్ నుంచి ఒత్తిడి(బిజినెస్) పెరుగుతుండటంతో తాజా ప్రణాళికలకు తెరతీసినట్లు తెలియజేశాయి. అయితే కస్లమర్ల విషయాలకు సంబంధించి మాట్లడబోమని ఫాక్స్‌కాన్ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. ఐఫోన్ XR ప్లాంటులో ఇప్పటికే చెన్పైలోని శ్రీపెరంబూర్ ప్లాంటులో యాపిల్ ఎక్స్ఆర్ మోడల్ ఐఫోన్లను ఫాక్స్‌కాన్ తయారు చేస్తోంది. ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా మరిన్ని మోడళ్ల ఐఫోన్లను రూపొందించాలని భావిస్తోంది. తద్వారా చైనాలో ఫాక్స్‌కాన్ చేపడుతున్న ఐఫోన్ తయారీ కార్యకలాపాలను కొంతమేర దేశీయంగా తరలించే యోచనలో ఉన్నట్లు అంచనా. వెరసి ఇక్కడ అదనంగా 6,000 మందికి ఉపాధి కల్పించవలసి ఉంటుందని విశ్లేషకులు తెలియజేశారు. ఇప్పటికే దేశీయంగా స్టార్ట్ ఫోన్ల విక్రయాలలో యాపిల్ ఐఫోన్లు 1 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఏపీలోనూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన ప్లాంటు ద్వారా చైనా కంపెనీ షియోమీ కార్ప్‌సహా పలు ఇతర కంపెనీల స్మార్ట్ ఫోన్లను ఫాక్స్‌కాన్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. మరోవైపు బెంగళూరు ప్లాంటులో యాపిల్ ఐఫోన్లలో కొన్ని మోడళ్లను అసెంబ్లింగ్ చేస్తున్న తైవాన్ కంపెనీ విస్ట్రన్ కార్ప్ సైతం ఫాక్స్‌కాన్ తరహా ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా యాపిల్ కంపెనీకి చెందిన ఇతర ప్రొడక్టుల తయారీని సైతం చేపట్టాలని యోచిస్తున్నట్లు సంబంధితవర్గాలు వెల్లడించాయి. మేకిన్ ఇండియా దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సాహించేందుకు గత నెలలో కేంద్ర ప్రభుత్వం 6.65 బిలియన్ డాలర్ల(రూ. 50,000 కోట్లు) విలువైన ప్రణాళికను ప్రకటించింది. దీనిలో భాగంగా దేశీయంగా స్మార్ట్ ఫోన్ తయారీ కార్యకలాపాలు ప్రారంభిస్తే గ్లోబల్ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించనుంది. వెరసి ప్రధాని మోడీ ప్రకటించిన మేకిన్ ఇండియా కార్యక్రమానికి మరింత మద్దతు లభించనుంది. అంతేకాకుండా కొత్తగా ఉద్యోగ కల్పనకు దారి ఏర్పడుతుందని పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. -
బ్రహ్మాండమైన అప్డేట్స్తో కొత్త ఐఫోన్, ట్రైలర్
సాక్షి, న్యూఢిల్లీ: యాపిల్ మరో ప్రతిష్టాత్మక స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. ఐఫోన్ 11 స్మార్ట్ఫోన్ల సిరీస్ లాంచింగ్ ముగిసిన వెంటనే తన పాపులర్ మోడల్ యాపిల్ ఐఫోన్ ఎస్ఆ సిరీస్ ఫోన్‌పై లీక్‌లు మొదలయ్యాయి. ముఖ్యంగా భారతదేశంలో తక్కువ రేటులో 2016లో తీసుకొచ్చిన ఐఫోన్ ఎస్ఈకి కొనసాగింపుగా ఎస్ఈ2ని లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ఒకటి ఐ ఫోన్ ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఐఫోన్ఎస్ఈ మాదిరిగానే కొత్త ఐఫోన్ ఎస్ఈ2 ఉన్నప్పటికీ 4.7 డిస్ప్లేతో రానున్న ఈ డివైస్‌లో ఐఫోన్11 సిరీస్‌లో పొందుపర్చిన గార్జియస్ ఫీచర్లను అమర్చింది. యాపిల్‌కు చెందిన అత్యంత ప్రియమైన డిజైన్‌తో పాటు వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఫేస్ ఐడి నాచ్ అప్ ఫ్రంట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ లాంటి లేటెస్ట్ స్పెసిఫికేషన్లతో, తక్కువ ధరలో తీసుకురానుంది. 2019 చివర్లో నిర్వహించే ఒక ఈవెంట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుందని అంచనా. చదవండి : యాపిల్ ఐఫోన్ 11 వచ్చేసింది.. -
ఐఫోన్ ఎస్ఈ కొనే వాళ్లు ఆగండి..
యాపిల్ తాజాగా ఆవిష్కరించిన ఐఫోన్ ఎస్ఈ కొనాలనుకుంటున్నారా? అయితే కొన్ని నెలలు ఆగాల్సిందే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఎందుకంటే ఐఫోన్ ఎస్ఈ ధర తగ్గుతుందంట. ప్ర్తస్తుతం భారత మార్కెట్లో రూ.39 వేలుగా ఉన్న దీని ధర రూ. 30 వేలకు పడిపోయే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండేట్టు ఈ ఫోన్ ధర తగ్గించనున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్ 5ఎస్ భారత్ మార్కెట్లో మంచి డిమాండ్ పలకడం, ఐఫోన్ ఎస్ఈకి ధర తగ్గుదలకు ఆటంకంగా మారింది. 2015 చివరి క్వార్టర్ లో ఈ ఐఫోన్ 5ఎస్ లను కంపెనీ ఎక్కువగా దిగుమతి చేసుకుంది. ఈ స్టాక్ అమ్ముడుపోయే వరకు ఐఫోన్ ఎస్ఈ ధర రూ.39 వేలగానే ఉంచేందుకు కంపెనీ నిర్ణయించింది. ఒకవేళ ఇప్పుడే ఐఫోన్ ఎస్ఈ ధర తగ్గిస్తే 5ఎస్ అమ్మకాలు పడిపోయే అవకాశాలు ఉండటంతో, ఐఫోన్ ఎస్ఈ ధర తగ్గింపుకు మరికొన్ని నెలలు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాని కొన్ని నెలల్లోనే యాపిల్ కచ్చితంగా ఐఫోన్ ఎస్ఈ ధరను తగ్గిస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అదేవిధంగా క్యాష్ బ్యాక్, ఈఎంఐ ఆఫర్లను కూడా ఐఫోన్ ఎస్ఈకి యాపిల్ కల్పించనుంది. ఐఫోన్ ఎస్ఈకు ముందు మార్కెట్లోకి వచ్చిన 16జీబీ ఐఫోన్ 6ఎస్ ధర కూడా కొన్ని నెలల్లోనే రూ.62 వేల నుంచి రూ.42 లకు పడిపోయింది. ఇదే విధంగా కొత్తగా మార్కెట్లో ఆవిష్కరించిన ఐఫోన్ ఎస్ఈ ధరను కూడా యాపిల్ తగ్గిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐఫోన్ 6ఎస్ కు, ఎస్ఈకి పెద్ద తేడాలు ఏమీ లేవని, ఒకే విధమైన ఫీచర్స్ ను ఈ ఫోన్లు కలిగి ఉన్నాయంటున్నారు.