Apple Announced IPhone 14 Pro And IPhone 14 Pro Max: Check Here Price, Specifications And Other Deatils - Sakshi
Sakshi News home page

Iphone 14 Pro, And Iphone 14 Pro Max : ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ విడుదల, ధర ఎంతంటే!

Published Thu, Sep 8 2022 7:43 AM | Last Updated on Thu, Sep 8 2022 10:32 PM

Iphone 14 Pro And Iphone 14 Pro Max Launched In India,check Prices, Specifications And Other Details - Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ బుధవారం రాత్రి ఐఫోన్‌ 14 సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా ఐఫోన్‌ 14 ప్రో, ప్రో మ్యాక్స్‌ గురించి ఫీచర్లు, వాటి ధరల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

ఐఫోన్‌ 14 ప్రో,  ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ ఫోన్‌లను యాపిల్‌ అప్‌గ్రేడ్‌ చేసింది. ఈ రెండు ఫోన్‌లలో పంచ్‌ హోల్‌ డిస్‌ప్లే, లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌గ్రేడ్‌ చేసింది. ఇది గత సంవత్సరం విడుదల చేసిన ఐఫోన్‌ 13 కంటే ఈ ఫోన్‌ మోడల్‌ లు పెద్దగా ఉన్నాయి. ఇందులో ఫేస్‌ ఐడి, రెండవది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. ఆసక్తికరంగా, యానిమేషన్‌ రూపంలో నోటిఫికేషన్‌లను పొందవచ్చు.  

ఈ ఫోన్‌ల డిస్‌ప్లే చుట్టూ సన్నని బెజెల్స్‌, సర్జికల్ గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్,టెక్ట్స్‌ర్డ్‌ మాట్టే గ్లాస్ డిజైన్‌ లు ఉన్నాయి. ఐఫోన్‌ ప్రో మోడల్ 6.1-అంగుళాల స్క్రీన్‌ ఉండగా..ప్రో మాక్స్ 6.7-అంగుళాల ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. హ్యాండ్‌సెట్‌లు స్పేస్ బ్లాక్, సిల్వర్, గోల్డ్, డీప్ పర్పుల్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.ఐఫోన్ 14,  ఐఫోన్ 14 ప్లస్ కాకుండా, ప్రో మోడల్స్ కొత్త ఏ16 బయోనిక్ చిప్‌సెట్‌తో విడుదలైంది.  

ఫోటోగ్రఫీ కోసం, 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో సహా ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. ఇది పాత మోడళ్లలో కనిపించే 12-మెగాపిక్సెల్ సెన్సార్ కంటే పెద్ద అప్‌గ్రేడ్. దీనికి 1.4 యూఏఎం పిక్సెల్‌లతో కూడిన కొత్త 12-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, హెచ్‌డీ క్వాలిటీ ఫోటోలు తీసేలా1.4యూఎం పిక్సెల్‌, సెటప్‌లో 3x ఆప్టికల్ జూమ్‌ను అందించే మెరుగైన టెలిఫోటో కెమెరా కూడా ఉంది.

ధరల విషయానికొస్తే 
ఐఫోన్‌ 14ప్రో ప్రారంభం ధర రూ.1,29,900, ఐఫోన్‌ 14ప్రో మ్యాక్స్‌ ధర రూ.1,39,900 గా ఉంది.  రెండు ఐఫోన్‌లు సెప్టెంబర్ 9న యూఎస్‌లో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement