ఇండియాలో ఐఫోన్ ఎస్ఈ కమింగ్ సూన్
న్యూఢిల్లీ: యాపిల్ కొత్త ఐఫోన్ స్పెషల్ ఎడిషన్ భారత్లో త్వరలోనే అడుగుపెట్టనుంది. ఏప్రిల్ 8 నుంచి భారత్లో ఐఫోన్ ఎస్ ఈ అమ్మకాలు ప్రారంభించనున్నట్లు యాపిల్ సంస్థ అధికారులు తెలిపారు. ఇండియాలో యాపిల్ ఫోన్ పంపిణీదారులైన రెడింగ్టన్, బీటెల్ టెలీటెక్ ఈ మేరకు రెండు ప్రత్యేక ప్రకటనలు జారీ చేశాయి. ఇది అచ్చం ఒకప్పుడు విడుదల చేసిన ఐఎఫోన్ 5ఎస్ లాగే ఉండి కొత్త ఫీచర్స్తో పనిచేయనుంది. భారత్లో ఈ ఫోన్ ధర రూ.39,000 ఉండే అవకాశం ఉంది.
రెడింగ్టన్ సంస్థ మొత్తం 3,000 ఔట్ లెట్ల నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభించనుండగా బీటెల్ సంస్థ 3,500 రిటెయిల్ ఔట్ లెట్ ద్వారా ఫోన్లను విక్రయించనుంది. ముందస్తుగా ఆర్డర్ చేయాలనుకున్నవారు మార్చి 29 అర్థరాత్రి 12.00గంటల బుక్ చేసుకోవచ్చు. యాపిల్ కంపెనీ తన తాజా ఐఫోన్ మోడల్ ఐఫోన్ ఎస్‌ఈ ను వచ్చే నెల 8 నుంచి భారత్‌లో విక్రయించనున్నది. 16 జీబీ, 64 జీబీ మోడళ్లలో లభించే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.39,000 వేలు ఉండనుంది. ఈ కొత్త ఐఫోన్‌లో నాలుగు అంగుళాల స్క్రీన్, వేగవంతమైన ఏ9 ప్రాసెసర్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 12 మెగా పిక్సెల్ ఐసైట్ కెమెరా, లైవ్ ఫొటోస్, వేగవంతమైన వెర్లైస్ వంటి ఫీచర్లున్నాయి.