అన్నదానం కాదు.. ఐఫోన్‌ కోసం పరుగులు | apple iphone 16 series launched in india price details | Sakshi
Sakshi News home page

అన్నదానం కాదు.. ఐఫోన్‌ కోసం పరుగులు

Published Fri, Sep 20 2024 10:09 AM | Last Updated on Fri, Sep 20 2024 10:51 AM

apple iphone 16 series launched in india price details

ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్‌కు ఉన్న క్రేజ్‌ అంతాఇంతా కాదు. యాపిల్‌ ఇటీవల ఐఫోన్‌ 16 సిరీస్‌ను లాంచ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్‌ 20 నుంచి సేల్స్‌ ప్రారంభమవుతాయని తెలిపింది. దాంతో ముంబయిలోని యాపిల్‌ అవుట్‌లెట్‌ ముందు కస్టమర్లు ఉదయం నుంచే బారులు తీరారు. ఎప్పుడెప్పుడు ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలా అని వేచిచూస్తున్నారు. ఈమేరకు ముంబయిలోని యాపిల్‌ స్టోర్‌ ముందు వినియోగదారుల రద్దీని తెలియజేస్తూ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేశారు. ఏదో అన్నదానం కోసం వచ్చిన వారిలా గుంపులుగా చేరి స్టోర్‌లోకి పరుగెత్తుతూ వీడియోలో కనిపించారు. ఇదికాస్తా వైరల్‌గా మారింది.

భారత్‌లో ఐఫోన్ 16 సిరీస్ ధరలు

ఐఫోన్ 16
128 జీబీ: రూ.79900
256 జీబీ: రూ.89900
512 జీబీ: రూ.109900

ఐఫోన్ 16 ప్లస్
128 జీబీ: రూ.89900
256 జీబీ: రూ.99900
512 జీబీ: రూ.119900

ఐఫోన్ 16 ప్రో
128 జీబీ: రూ.119900
256 జీబీ: రూ.129900
512 జీబీ: రూ.149900
1 టీబీ: 169900

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్
256 జీబీ: రూ.144900
512 జీబీ: రూ.164900
1 టీబీ: రూ.184900

ఇదీ  చదవండి: టెలికాం కంపెనీల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement