ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్ ఏటా నిర్వహించే ‘యాపిల్ ఈవెంట్’ తేదీని ప్రకటించింది. ముందుగా ఈ ఈవెంట్‌ను సెప్టెంబర్ 10న నిర్వహించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఒకరోజు ముందే అంటే సెప్టెంబర్ 9న యాపిల్ ఈవెంట్ జరుపుతామని ప్రకటించారు. కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్ ఈ కార్యక్రమానికి వేదిక కానుంది.
యాపిల్ కంపెనీ ఈ ఈవెంట్‌లో తమ సంస్థ కొత్త ఉత్పత్తులు, వాటి ఫీచర్లకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తారు. ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ దిగ్గజ కంపెనీ ఎలాంటి టెక్నాలజీపై పనిచేస్తుందో ఇతర కంపెనీలు ఒక అంచనాకు వస్తాయి. అందుకు తగ్గట్టుగా ఆయా సంస్థలు తమ ఉత్పత్తుల్లో మార్పులు చేర్పులు చేస్తుంటాయి. అందుకే ఈ ఈవెంట్‌కు చాలా ఆదరణ ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏటా సెప్టెంబర్ రెండో వారంలో యాపిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గతేడాది సెప్టెంబర్ 12న కాలిఫోర్నియా వేదికగా ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 10న దీన్ని ఏర్పాటు చేయాలని ముందుగా ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఒకరోజు ముందే సెప్టెంబర్ 9న ఈ ఈవెంట్‌ను జరుపుతున్నట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి: టెలిగ్రామ్‌ను నిషేధిస్తారా..? సీఈఓ అరెస్టు!
ఈ కార్యక్రమంలో యాపిల్ ఐఫోన్ 16 సిరీస్, యాపిల్ వాచ్, మ్యాక్‌బుక్, ఎయిర్‌పాడ్స్‌లో కొత్త ఫీచర్లు, రాబోయే మార్పుల గుర్తించి తెలియజేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలాఉండగా, ఈ ఈవెంట్‌కు ‘ఇట్స్ గ్లోటైమ్’ అనే ట్యాగ్ లైన్‌ను జత చేశారు. దాంతో ఈ కార్యక్రమంపై అంచనాలు పెరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment