ధన్‌తేరాస్ సందర్బంగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లైన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో, బిగ్‌బాస్కెట్ వంటి వాటి ద్వారా కేవలం 10 నిమిషాల్లో కస్టమర్లకు బంగారు, వెండి నాణేలను అందించారు. అయితే ఆన్‌లైన్‌లో గోల్డ్, సిల్వర్ కాయిన్స్ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూసేద్దాం..
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి బ్లింకిట్ ద్వారా మోహిత్ జైన్ అనే వ్యక్తి.. 24 క్యారెట్ల 1 గ్రామ్ లక్ష్మి గోల్డ్ కాయిన్, 10 లక్షి గణేష్ సిల్వర్ కాయిన్ ఆర్డర్ చేశారు. అయితే అతనికి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ స్థానంలో 0.5 గ్రామ్ గోల్డ్ కాయిన్ డెలివరీ అయింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.
ఫోటోలను షేర్ చేస్తూ.. బ్లింకిట్ డెలివరీ చేసే సమయానికి నేను ఇంట్లో లేను, అందుకే దాన్ని రిసీవ్ చేసుకోవడానికి మా తమ్ముడికి ఓటీపీ చెప్పి తీసుకోమన్నాను. కానీ నేను 20 నిమిషాల తర్వాత ఇంటికి వచ్చి చూసేసరికి 0.5 గ్రామ్ గోల్డ్ కాయిన్ డెలివరీ అయి ఉండటం చూసి ఖంగుతిన్నాను వెల్లడించారు.
వచ్చిన డెలివరీకి ఆర్డర్ చేద్దామనుకుంటే.. రిటర్న్ విండో గడువు ముగిసింది. ఇప్పటి వరకు ఇంత ఖరీదైన వస్తువులను బ్లింకిట్‌లో ఆర్డర్ చేయడం ఇదే మొదటిసారి. అయితే డెలివెరీకి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా ఉందని కూడా పేర్కొన్నారు. ఇది చూసిన చాలామంది ఆన్‌లైన్‌లో జరుగుతున్న మోసాలపైన మండిపడ్డారు.
Got scammed by blinkit
I ordered 1 gm gold coin from blinkit, along with the 1gm silver coin. It was all prepaid. I wasn't there at home to receive the order, so I gave the otp to my younger brother to get it received. After 20 mins I reached home and saw wrong item was… pic.twitter.com/N15wSfIhpt— Mohit Jain (@MohitJa30046159) October 29, 2024
Comments
Please login to add a commentAdd a comment