ప్రేమ బంధానికి వయసుతో సంబంధం ఏముంది.. నువ్వే నా శ్వాసా..మనసున నీకై అభిలాషా ..ప్రియతమా ఓ ప్రియతమా.. ఇదేగా ఇరు మనుసులకు బాసట...ఊరట. లేటు వయసులో ఘాటు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న ప్రముఖులు లిస్ట్ కూడా చాలా పెద్దది. అలాంటి వారిని ఒకసారి పరిశీలిద్దాం.!
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా పేరు గాంచిన బిల్ గేట్స్ (Bill Gates) లేటు వయసులో ప్రేమలో పడ్డాడు. తొలి భార్య మిలిందాతో విడాకులు తీసుకున్న బిల్ గేట్స్ ఒరాకిల్ దివంగత సీఈవో భార్య పాలా హర్డ్‌తో ప్రేమలోపడ్డాడు. అలాగే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రియురాలు లేటు వయసులో తన ప్రేయసి లారెన్ సాంచెజ్‌ప్రేమలోపడ్డాడు. ఇటీవల నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు.
రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్ అధినేత కేపీ సింగ్ భార్య ఇందిర మరణం తర్వాత ఒంటరితనాన్ని జయించేందుకు తోడు వెతుక్కున్నారు. 91 ఏళ్ల వయసులో ప్రేమను మళ్లీ పొందానని స్వయంగా ప్రకటించిన ఆయన జీవితంలో మనిషికి భాగస్వామి అవసరాన్ని నొక్కి చెప్పారాయన.
హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ 61ఏళ్ల వయసులో 36 ఏళ్ల అమ్మాయితో నాలుగోసారి ప్రేమాయణం వార్తకూడా గత ఏడాది వార్తల్లో నిలిచింది. రష్యాకి చెందిన ప్రముఖ మోడల్ ‘ఎల్సినా ఖైరోవా’ తో ప్రేమలో మునిగి తేలుతున్నాడట. ఇద్దరూ చాలా ఈవెంట్లలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. తాజాగా వీరి ప్రేమే లేటెస్ట్ సెన్సేషన్.
ఇక టాలీవుడ్‌లో పరిచయం అవసరం లేని ప్రేమ జంట నరేష్, పవిత్రా లోకేష్. పెళ్లి చేసుకున్నాం ఆశీర్వదించండి అంటూ ‘మళ్లీ పెళ్లి’ సినిమా పెళ్లి వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేసిన సంచలనం రేపిన ఈ జంట లీగల్ సమస్యల కారణంగా ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు 49 ఏళ్ల వయసులో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మొదటి భార్య అనిత అనారోగ్యంతో మరణించడంతో ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పి, రెండో పెళ్లి చేసుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన తేజస్వినితో ఏడడుగులు వేశారు. ప్రస్తుతం తేజస్విని-దిల్ రాజు దంపతులకు ఒక బాబు కూడా ఉన్నాడు.
టాలీవుడ్‌లో ప్రముఖ గాయని సునీత పెళ్లి ముచ్చటను ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. చిన్న వయసులోనే ప్రేమ పెళ్లి, ఇద్దరు బిడ్డలు, ఆ తరువాత అనుకోని పరిస్థితుల్లో విడిపోవాల్సి వచ్చింది. విడాకుల తరువాత చాలా కాలానికి మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహాన్ని సునీత టీనేజ్ పిల్లలు అర్థం చేసుకోవడమే కాదు, దగ్గరుండి మరీ మనసారా వీరి పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించడం గొప్ప విశేషం.
వీరే కాదు.. చిన్నవయసులోనే భర్తను కోల్పోయిన అమ్మకు, భార్యను కోల్పోయిన తండ్రులకు కన్నబిడ్డలే పెళ్లిళ్లి చేసిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. జీవితాలను త్యాగం చేసి, ఎన్నో కష్టనష్టాలకోర్చి, తమను పెంచి, ప్రయోజకుల్ని అమ్మా, నాన్నల ఒంటరితనాన్ని ప్రేమతో నింపి వారి రుణం తీర్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment