ఒక్క సెకన్లో 10,000 ఫోన్లు సేల్! | Lenovo sells 10,000 K4 Note units in less than a second | Sakshi
Sakshi News home page

ఒక్క సెకన్లో 10,000 ఫోన్లు సేల్!

Published Thu, Jan 21 2016 11:17 AM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM

ఒక్క సెకన్లో 10,000 ఫోన్లు సేల్!

ఒక్క సెకన్లో 10,000 ఫోన్లు సేల్!

ఆన్లైన్ సేల్స్లో లెనోవా ఫోన్స్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. అమెజాన్ ఆన్లైన్ మార్కెంటింగ్ ద్వారా మార్కెట్ లోకి విడుదలైన లెనోవా కె4 నోట్ మోడల్ ఒక్క సెకన్లో పదివేల ఫోన్లు అమ్ముడుపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలోనూ ఇదే స్థాయిలో సంచలనాలు నమోదు చేసింది లెనోవా. కొంత కాలంగా ఈ మోడల్ మొబైల్ కోసం అడ్వాన్స్ బుకింగ్ అవకాశం కల్పించిన లెనోవా సంస్థ 4,80,566 రిజిస్ట్రేషన్లను స్వీకరించింది.

3 జీబీ రామ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి అధునాతన ఫీచర్స్తో హై ఎండ్ మొబైల్గా రూపొందిన లెనోవా కె4 ధర రూ.12,499. ప్రస్తుతానికి అమెజాన్ ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారానే అందుబాటులో ఉన్న ఈ మొబైల్ జనవరి 5న ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేయగా, జనవరి 19 నుంచి ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చింది. తొలి సెకన్లోనే 10,000 ఫోన్లు అమ్ముడయినట్టుగా సంస్థ తన అఫీషియల్ ట్విట్టర్లో వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement