
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ‘ఎం2 కాంపిటిషన్’ పేరుతో కొత్త వెర్షన్ కారును గురువారం విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.79.9 లక్షలు. దేశవ్యాప్తంగా అన్ని డీలర్‌షిప్ కేంద్రాల్లో ఇది అందుబాటులో ఉంటుం దని కంపెనీ తెలిపింది. మూడు లీటర్ల పెట్రోల్ ఇంజన్‌తో కూడిన ఈ కారు కేవలం 4.2 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని, గరిష్ట వేగం 250 కిలోమీటర్లు అని పేర్కొంది.
ఆన్‌లైన్ అమ్మకాల కోసం ప్రత్యేక పోర్టల్
బీఎండబ్ల్యూ భారత్‌లో ఆన్‌లైన్ అమ్మకాలను ప్రారంభించింది. ఇందు కోసం http://www. shop.bmw.in పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కస్టమర్లు ఆన్‌లైన్లో కార్ల స్పెసిఫికేషన్లను పోల్చుకుని, తగిన మోడల్‌ను ఎంపిక చేసుకుని, అక్కడే కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. కొనుగోలుకు ముందు సందేహాలు ఉంటే అప్పటికప్పుడే వాటిని తొలగించుకోవచ్చని కూడా సూచించింది. డిజిటలైజేషన్ భవిష్యత్తులో చాలా కీలకమైన రిటైల్ చానల్‌గా అవతరిస్తుందని బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా చైర్మన్ విక్రమ్ పవా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment