ముంబై: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా బుధవారం తన కొత్త 220ఐ స్పోర్ట్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ధరను ఎక్స్ షోరూం వద్ద రూ.37.9 లక్షలుగా నిర్ణయించింది. స్థానికంగా చెన్నై ప్లాంట్‌లో తయారైన ఈ కారు దేశవ్యాప్తంగా ఉండే బీఎండబ్యూ డీలర్‌షిప్‌ల వద్ద లభిస్తాయని కంపెనీ తెలిపింది. కొత్త బీఎమ్‌డబ్బ్యూ 220ఐ స్పోర్ట్ రెండు లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 190 హార్స్ పవర్స్ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయగలదు. కేవలం 7.1 సెకన్లలో గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
బీఎండబ్బూ 2 సీరీస్ గ్రాన్ కూపే మోడల్ శ్రేణిలో వస్తున్న 220ఐ స్పోర్ట్ వేరియంట్‌లో అనేక అత్యాధునిక ఫీచర్లను చేర్చినట్లు కంపెనీ ప్రెసిడెంట్ విక్రమ్ పావా తెలిపారు. లగ్జరీ విభాగపు కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా తమ ఉత్పత్తుల శ్రేణిని విస్తరిస్తామని పావా పేర్కొన్నారు. స్పోర్ట్స్ సీట్లు (డ్రైవర్, ముందు ప్రయాణికులకు), యాంబియెంట్ లైట్ ప్యాకేజీ, పనోరమా సన్‌రూఫ్, పెర్ఫామెన్స్ కంట్రోల్, పార్కింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment