Black Friday in India
-
బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ అదుర్స్
అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్లాక్ ఫ్రైడే సేల్స్ సంస్కృతి ఇప్పుడు భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించింది. దసరా–దీపావళి డిస్కౌంట్ సేల్స్‌కు దీటుగా ఈసారి రిటైల్ సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో భారీ డిస్కౌంట్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు జరిగే ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో పలు ఉత్పత్తులపై ఏకంగా 50 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్స్‌ను ఇస్తున్నాయి. ఎయిర్ ఇండియా, ఐఆర్టీసీ దగ్గర నుంచి ఆన్లైన్ రిటైల్ సంస్థలు, గృహోపకరణాల సంస్థలు ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్ సందర్భంగా ప్రత్యేక రాయితీలు ప్రకటించాయి. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2వ తేదీలోపు విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఎయిర్ ఇండియా 12 నుంచి 20 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణ టికెట్ చార్జీలపై 12 శాతం, దేశీయ టికెట్ చార్జీలపై 20 శాతం డిస్కౌంట్‌ను ఇస్తోంది. ఐఆర్టీసీ అయితే ఈ ఆఫర్ సమయంలో కన్వేనియన్స్ ఫీజులను తొలగించడంతోపాటు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. – సాక్షి, అమరావతి బ్లాక్ ఫ్రైడే సేల్స్ అంటే..» అమెరికాలో రైతులు తమ పంటల దిగుబడి పూర్తయినందుకు సంతోషంగా ప్రతి ఏడాది నవంబర్ నాలుగో గురువారం ‘థ్యాంక్స్ గివింగ్’ పేరిట పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ రోజు ఆమెరికాలో జాతీయ సెలవు దినం. » ‘థాంక్స్ గివింగ్ డే’ మరుసటి రోజు వచ్చే శుక్రవారాన్ని ‘బ్లాక్ ఫ్రైడే సేల్స్’ పేరుతో షాపింగ్ కోసం కేటాయిస్తారు.» డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపార సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లో భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తాయి. » అమెరికాలో అత్యధికంగా అమ్మకాలు జరిగేది ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్‌లోనే. » ఇప్పుడు ఈ సంస్కృతి నెమ్మదిగా మన దేశంలోకి కూడా విస్తరించింది.ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, మింత్రా వంటి ఈ–కామర్స్ దిగ్గజ సంస్థలు భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా శామ్సంగ్, షియోమీ, సోనీ, హెచ్‌పీ వంటి సంస్థలు కూడా డిస్కౌంట్ ఆఫర్స్‌ను ప్రకటించాయి. సామ్సంగ్ తన గెలాక్సీ ఫోన్లపై రూ.12,000 వరకు, రెడ్మీ అయితే రూ.15,000 వరకు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఎంపిక చేసిన బ్యాంకుల కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే అదనపు తగ్గింపును వర్తింపజేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు 35 నుంచి 40శాతం వరకు పెరుగుతాయని ఈ–కామర్స్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. డిసెంబర్ 2న ‘సైబర్ మండే’తో ఈ డిస్కౌంట్ అమ్మకాలు ముగుస్తాయి. -
కొనుగోలు దారులకు బంపరాఫర్.. ఈ ప్రొడక్ట్‌లపై 85 శాతం డిస్కౌంట్!
న్యూఢిల్లీ: ఈ కామర్స్ సంస్థలు, ఆఫ్‌లైన్ దుకాణాలు అమ్మకాలు పెంచుకునేందుకు మరో విడత డిస్కౌంట్ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. బ్లాక్ ఫ్రైడే (నవంబర్ 24), సైబర్ మండే (నవంబర్ 27) సందర్భంగా మంచి డీల్స్‌ను ప్రకటిస్తుండడం కనిపిస్తోంది. దసరా, దీపావళి సందర్భంగా దాదాపు అన్ని ఈ కామర్స్ సంస్థలు, ప్రముఖ బ్రాండ్లు, రిటైలర్లు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. మరోసారి అదే విధమైన వాతావరణం నెలకొంది. పాశ్చాత్యదేశాల్లో క్రిస్మస్, బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు ఎక్కువగా నమోదవుతుంటాయి. అదే విధమైన సంస్కృతి క్రమంగా మన దేశంలోనూ విస్తరిస్తోంది. టాటా గ్రూప్‌లో భాగమైన ఈ కామర్స్ సంస్థ టాటా క్లిక్, టాటా క్లిక్ లగ్జరీ, టాటా క్లిక్ ప్యాలెట్ బ్లాక్ ఫ్రైడే సందర్భంగా భారీ ఆఫర్లతో డీల్స్‌ను ప్రకటించాయి. ‘థ్యాంక్స్ గాడ్, ఇట్స్ బ్లాక్ ఫ్రైడే’ అనే ట్యాగ్‌లైన్ వేశాయి. వస్త్రాలు, సౌందర్య సాధనాలు, పాదరక్షలు, ఆభరణాలు, వాచ్‌లపై ఆఫర్లు తీసుకొచ్చాయి. టాటా క్లిక్, టాటా క్లిక్ లగ్జరీ నవంబర్ 22 నుంచి 27 వరకు ఈ సేల్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. టాటా క్లిక్ ప్యాలెట్ అయితే ఈ నెల 17 నుంచి 27 వరకు సేల్స్‌ను చేపట్టింది. ‘‘బ్లాక్ ఫ్రైడే సేల్ అన్నది ఎంతో ఆసక్తికరమైన కార్యక్రమం. వినియోగదారులు ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఆఫర్లు అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్లపై అందిస్తున్నాం’’అని టాటా క్లిక్ సీఈవో గోపాల్ ఆస్థానా తెలిపారు. పండుగల అమ్మకాలు క్రిస్మస్, నూతన సంవత్సరం వరకూ కొనసాగుతాయని టాటా క్లిక్ అంచనా వేస్తోంది. హ్యూగో బాస్, జిమ్మీ చూ తదితర బ్రాండ్లపై 85 శాతం వరకు తగ్గింపును టాటా క్లిక్ ఆఫర్ చేస్తోంది. అమెజాన్ సైతం.. అమెజాన్ బ్యూటీ సైతం బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే సందర్భంగా డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ నెల 24 నుంచి 26 వరకు ‘ద బ్యూటీ సేల్’ను నిర్వహిస్తోంది. అన్ని రకాల సౌందర్య ఉత్పత్తులపై 60 శాతం వరకు, లగ్జరీ బ్యూటీ ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది. 300 బ్రాండ్లపై 8,000 డీల్స్‌ను ప్రకటించింది. ప్రతి రోజూ రాత్రి 8పీఎం డీల్స్ పేరుతో అర్థరాత్రి వరకు ప్రత్యేక ఆఫర్లను ఇస్తోంది. ‘‘చర్మ, శిరోజాల సంరక్షణపై గడిచిన్న కొన్నేళ్లలో భారత వినియోగదారుల్లో ఎంతో అవగాహన పెరుగుతుండడం గమనించాం. దీంతో ప్రీమియం ఉత్పత్తుల కోసం చేసే ఖర్చు పెరిగింది’’అని అమెజాన్ ఇండియా సౌందర్య ఉత్పత్తుల విభాగం డైరెక్టర్ జెబా ఖాన్ తెలిపారు. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు, ఫర్నిచర్‌పై 75 శాతం వరకు తగ్గింపుతో కూడిన టాప్ డీల్స్‌ను ఆఫర్ చేస్తున్నట్టు అమెజాన్ ఇండియా అధికార ప్రతినిధి సైతం ప్రకటించారు. -
ఈబే ఇండియా బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు
న్యూఢిల్లీ: ఈబే ఇండియా బ్లాక్ ఫ్రైడే అమ్మకాలను భారత్‌లో పరిచయం చేస్తోంది. షాప్యువర్వరల్డ్డాట్కామ్ సంస్థతో కలిసి ఈ అమ్మకాలను ఆఫర్ చేస్తున్నామని ఈబే ఇండియా డెరైక్టర్, బిజినెస్ హెడ్ విద్మే నైని తెలిపారు. శుక్రవారం నుంచే ప్రారంభమైన ఈ అమ్మకాల ఆఫర్లు ఈ నెల 30 వరకూ అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ ఆఫర్లో భాగంగా అమెరికా ఉత్పత్తులను రూపాయల్లో (అన్ని దిగుమతి సుంకాలు కలుపుకొని) అందిస్తామని, గ్లోబల్ ఈజీ బై ద్వారా కొనుగోలు చేస్తే రవాణా చార్జీలు ఉచితమని పేర్కొన్నారు. దాదాపు 10వేల డీల్స్ అందుబాటులో ఉన్నాయని, టెక్నాలజీ, జీవనశైలి ఉత్పత్తులు 80 శాతం డిస్కౌంట్‌కే లభించే అవకాశాలున్నాయని వివరించారు. అమెరికాలో థాంక్స్ గివింగ్ డే తర్వాత వచ్చే శుక్రవారాన్ని బ్లాక్ ఫ్రైడేగా వ్యవహరిస్తారు. సాధారణంగా క్రిస్మస్ షాపింగ్ సీజన్ ఈ రోజు నుంచే మొదలవుతుంది. ఈ రోజున కంపెనీలు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తాయి. షాపింగ్ కూడా భారీ స్థాయిలో జరుగుతుంది. కాగా వచ్చే నెలలో గూగుల్ సంస్థ గ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్(జీఓఎస్ఎఫ్) ను ఆఫర్ చేయనున్నది.