శాన్‌ఫ్రాన్సిస్కో: బ్లాక్ ఫ్రైడే విక్రయాల్లో స్మార్ట్‌ఫోన్లు దుమ్ము రేపాయి. ఈ సందర్భంగా అమెరికాలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. నవంబర్ మాసంలో నాలుగవ గురువారం జరుపుకునే థాంక్స్ గివింగ్ మరునాడు పలు విక్రయ సంస్థలు ఆఫర్ చేసే బ్లాక్ ఫ్రైడే సేల్ రికార్డ్ హైని నమోదు చేసిందంటూ పలు నివేదికలు వెలువడ్డాయి.
బ్లాక్ ఫ్రైడే అమ్మకాల్లో స్మార్ట్‌ఫోన్లు రికార్డులు బద‍్దలు కొట్టాయని అడోబ్ డిజిటల్ ఇన్‌సైట్స్ రిపోర్ట్ చేసింది. 61.1 శాతం వినియోగదారులు స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లతో సహా మొబైల్ పరికరాలపై ఎక్కువ ఆసక్తి కనబర్చినట్టు చెప్పింది. 2016లో అమ్మకాలతో పోలిస్తే 2017లో 4.9శాతం జంప్ చేసినట్టు గార్టనర్ నివేదించింది. ఈ ఏడాది 1.7 బిలియన్ యూనిట్ల విక్రయాలు జరిగినట్టు అంచనా వేసింది. ఈ హాలిడే సీజన్ షాపింగ్ అంటే మొబైల్ షాపింగే అన్నట్టుగా ఉందని అడోబ్ ఇన్‌సైట్ డివిజన్ ఉపాధ్యక్షుడు మిక్కీ మెర్రిక్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ సీఎన్‌బీసీ నివేదించింది.
కాగా గత కొన్ని సంవత్సరాలుగా యూరోపియన్ దేశాల్లో నిర్వహించే బ్లాక్‌ఫ్రైడే సేల్ ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్ ఫ్లాట్‌ఫాంలలో భారీ స్థాయిలో కొనుగోళ్లు నమోదు కావడం సాధారణం. యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ సహా పలు ఐరోపా దేశాలలో షాపింగ్ సందడి నెలకొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment