తిరుచానూరు, న్యూస్‌లైన్: అతిథులకు అత్యుత్తమ సేవలందించడమే తమ లక్ష్యమని ఐటీసీ ఫార్చ్యూన్ గ్రూప్స్ డెరైక్టర్ రోహిత్ మల్హోత్ర, హోటల్ గ్రాండ్‌రిడ్జ్ చెర్మైన్ టీ కృష్ణప్రసాద్ తెలిపారు. హోటల్ రంగంలో నిష్ణాతులైన ఐటీసీ ఫార్చ్యూన్ గ్రూప్స్‌తో తిరుచానూరు రోడ్డులోని గ్రాండ్‌రిడ్జ్ హోటల్ శ నివారం యాజమాన్య భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. దీంతో హోటల్ గ్రాండ్‌రిడ్జ్ పేరును ఫార్చ్యూన్ సెలెక్ట్ గ్రాండ్‌రిడ్జ్‌గా మార్పు చేసి శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిం చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ రంగానికి చెందిన వారికి అనువుగా తమ హోటల్‌లో వసతులు ఉన్నాయని తెలిపారు. దేశంలో దాదాపు వంద ఫార్చ్యూన్ గ్రూప్‌కు చెందిన హోటల్స్ ఉన్నాయని, అందులో 40 వరకు యా జమాన్య భాగస్వామ్యంతో నడుస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా గా తిరుపతిలో గ్రాండ్‌రిడ్జ్ భాగస్వామ్యంతో ఈ సంఖ్య 41కి చేరుకుందని తెలిపారు. ప్రతి 180 కిలోమీటర్లకు తమ హో టల్‌ను నెలకొల్పడమే సంకల్పమని చెప్పారు. చిన్న నగరాల్లో కూడా హోటళ్ల అన్ని హంగులతో నెలకొల్పుతామన్నారు. హోటల్ డెరైక్టర్లు శివరామకృష్ణ, లింగారావు, ఫార్చ్యూన్ సంస్థ కార్పొరేట్ హౌస్‌కీపర్ షిప్రానాయర్ పాల్గొన్నారు.
అత్యుత్తమ సేవలే ‘ఫార్చ్యూన్’ లక్ష్యం
Published Sun, Sep 8 2013 2:50 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM
Advertisement
Advertisement