T. Krishna prasad
-
గోల్డ్‌క్వెస్ట్ కేసులో మరో నిందితుడి అరెస్ట్
ఇమ్మిగ్రేషన్ తనఖీల్లో చిక్కిన సూత్రధారి సాక్షి, హైదరాబాద్: గోల్డ్‌క్వెస్ట్ స్కీమ్స్ పేరుతో నెల్లూరు జిల్లా కావలిలో అనేక మందిని నిండా ముంచిన కేసులో మరో నిందితుడిని గురువారం అరెస్టు చేసినట్లు సీఐడీ అదనపు డీజీ టి.కృష్ణప్రసాద్ వెల్లడించారు. కావలి టౌన్ కేంద్రంగా వ్యవహారాలు నడిపిన క్వెస్ట్‌నెట్ ఎంటర్ప్రైజెస్ సంస్థ వివిధ స్కీముల పేరుతో అనేక మందికి ఎరవేసి ఒక్కొక్కరి నుంచి రూ. 33 వేల నుంచి రూ. 66 వేల వరకు వసూలు చేసి మోసగించింది. దీనికి సంబంధించి స్థానిక టౌన్ పోలీసుస్టేషన్లో నమోదైన కేసును దర్యాప్తు నిమిత్తం సీఐడీకి బదిలీ అయ్యింది. కొందరు నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న వారి కోసం లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేసి అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడు రావి రమేష్‌బాబు ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో అధికారులకు చిక్కారు. విషయం తెలుసుకున్న సీఐడీ అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో చిక్కిన ‘వరకట్న’ నిందితుడు.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో నిందితుడు స్వామినాథన్ శివానందం శుక్రవారం చెన్నై విమానాశ్రయంలో పట్టుబడినట్లు కృష్ణప్రసాద్ తెలిపారు. 2010లో నమోదైన ఈ కేసులో బెయిల్ పొందిన శివానందం కోర్టు వాయిదాలకు హాజరుకావట్లేదు. దీంతో సంబంధిత న్యాయస్థానం ఇతడిపై వారెంట్ జారీ చేసింది. ఈ అరెస్టును తప్పించుకోవడానికి నిందితుడు ఖతర్‌లో తలదాచుకున్నాడు. దీంతో సైబరాబాద్ పోలీసు కమిషనర్ విజ్ఞప్తి మేరకు సీఐడీ పోలీసులు ఎల్ఓసీ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నిందితుడు గురువారం ఉదయం ఖతర్ నుంచి తిరిగి వస్తూ చెన్నైలోని విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులకు పట్టుబడ్డాడు. -
అత్యుత్తమ సేవలే ‘ఫార్చ్యూన్’ లక్ష్యం
తిరుచానూరు, న్యూస్‌లైన్: అతిథులకు అత్యుత్తమ సేవలందించడమే తమ లక్ష్యమని ఐటీసీ ఫార్చ్యూన్ గ్రూప్స్ డెరైక్టర్ రోహిత్ మల్హోత్ర, హోటల్ గ్రాండ్‌రిడ్జ్ చెర్మైన్ టీ కృష్ణప్రసాద్ తెలిపారు. హోటల్ రంగంలో నిష్ణాతులైన ఐటీసీ ఫార్చ్యూన్ గ్రూప్స్‌తో తిరుచానూరు రోడ్డులోని గ్రాండ్‌రిడ్జ్ హోటల్ శ నివారం యాజమాన్య భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. దీంతో హోటల్ గ్రాండ్‌రిడ్జ్ పేరును ఫార్చ్యూన్ సెలెక్ట్ గ్రాండ్రిడ్జ్గా మార్పు చేసి శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ రంగానికి చెందిన వారికి అనువుగా తమ హోటల్లో వసతులు ఉన్నాయని తెలిపారు. దేశంలో దాదాపు వంద ఫార్చ్యూన్ గ్రూప్‌కు చెందిన హోటల్స్ ఉన్నాయని, అందులో 40 వరకు యా జమాన్య భాగస్వామ్యంతో నడుస్తున్నట్లు పేర్కొన్నారు. తాజా గా తిరుపతిలో గ్రాండ్‌రిడ్జ్ భాగస్వామ్యంతో ఈ సంఖ్య 41కి చేరుకుందని తెలిపారు. ప్రతి 180 కిలోమీటర్లకు తమ హో టల్‌ను నెలకొల్పడమే సంకల్పమని చెప్పారు. చిన్న నగరాల్లో కూడా హోటళ్ల అన్ని హంగులతో నెలకొల్పుతామన్నారు. హోటల్ డెరైక్టర్లు శివరామకృష్ణ, లింగారావు, ఫార్చ్యూన్ సంస్థ కార్పొరేట్ హౌస్‌కీపర్ షిప్రానాయర్ పాల్గొన్నారు.