- ఏసీపీ, సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల ప్రమేయం
- ఏసీపీ వీఆర్‌కు, సీఐ, కానిస్టేబుళ్ల సస్పెన్షన్
సాక్షి ప్రతినిధి, విజయవాడ : పెద్దఅవుటపల్లి వద్ద జరిగిన తండ్రి, ఇద్దరు కుమారుల హత్యకేసులో పోలీసుల పాత్రపై దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని పెదవేగి పోలీస్‌స్టేషన్ పోలీసులకు మొదటినుంచీ కల్పతరువుగా మారిందని సమాచా రం. పినకడిమికి చెందిన కొందరు విదేశాల కు వెళ్లి జాతకాలు చెప్పి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న వారిని టార్గెట్ చేసి పెదవేగిలో పనిచేసే పోలీసులు లక్షల్లో సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. పినకడిమి వాసులు కేవలం జాతకాలు చెప్పడం ద్వారానే కోట్లలో డబ్బు ఎలా సంపాదిస్తున్నారనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.
జాతకాల పిచ్చి ఉన్న కొంతమంది పోలీసు అధికారులు పినకడిమి లో జాతకాలు చెప్పేవారికి కావాల్సిన అవసరా లు తీర్చడంలో ముందున్నారు. అటువంటివారిపై విజయవాడ సీపీ వెంకటేశ్వరరావు ప్రత్యే క నిఘా వేశారు. పెద్దఅవుటపల్లి వద్ద ముగ్గు రు వ్యక్తులను కాల్చి చంపుతున్నప్పుడు ఇద్దరు కానిస్టేబుళ్లు హతుల కారులోనే ఉండ టం, ఆ తరువాత వారు పరారు కావడం, కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో అసలు విషయం వెలుగులోకి రావడం తెలిసిందే. తాము హతులకు రక్షణగా వెళ్లామని కానిస్టేబుళ్లు చెప్పారు. అయితే వారు అనధికారికంగా ఎందుకు వెళ్లారనేది చర్చనీయాంశమైంది.
ఏలూరు వన్‌టౌ న్ సీఐ మురళీకృష్ణ ఆదేశాలతో వారు వెళ్లినప్పటికీ ఆయన కానీ, కానిస్టేబుళ్లు కానీ జరిగిన విషయాన్ని విజయవాడ సీపీకి చెప్పలేదు. విచారణలో ఈ విషయం వెలుగు చూడటంతో సీపీకి మరింత అనుమానం వచ్చింది. బాధితు లు, నిందితులతో ఏలూరు వన్‌టౌన్ పోలీసులకు ఉన్న సంబంధాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో సీఐ, ఇద్దరు కాని స్టేబుళ్ల పాత్ర గురించి తెలిసిన వెంటనే సస్పెం డ్ చేశా రు. వీరిపై కేసు నమోదుకు న్యాయపరంగా ఎదురయ్యే అంశాలను పరిశీలిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మరో పోలీస్ అధికారికి కుట్రదారులతో ఉన్న సంబంధాలు వెలుగులోకి వచ్చా యి. విజయవాడలో స్పెషల్ బ్రాంచి ఏసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న నక్కా సూర్యచంద్రరావు 2001లో పెదవేగి స్టేషన్ ఎస్సైగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత సీఐగా కూ డా అక్కడ పనిచేశారు. మూడు హత్యల గురిం చి ఆయనకు కొంత సమాచారం తెలిసే అవకాశం ఉందని సీపీ వెంకటేశ్వరరావు భావిం చారు. దీనిపై సూర్యచంద్రరావును వివరాలు అడిగారు. నిందితులు ఎక్కడ ఉన్నారనే దాని పై సూర్యచంద్రరావు నుంచి సమాచారం తెలుసుకునేందుకు సీపీ చేసిన ప్రయత్నం ఫలించలేదు.
దీంతో ఆయన సూర్యచంద్రరావు ఎవరెవరితో ఎప్పుడెప్పుడు మాట్లాడాడనే విషయా న్ని తెలుసుకునేందుకు ఫోన్ కాల్‌డేటా తెప్పిం చి పరిశీలించారు. ముగ్గురి హత్యకేసులో ప్రధా న కుట్రదారుగా భావిస్తున్న భూతం గోవిం ద్‌తో ఏసీపీ అనేకసార్లు మాట్లాడినట్లు కాల్‌డేటాలో వెల్లడైంది. ఏసీపీ నిజం చెప్పకుండా నిందితునికి పరోక్షంగా సహకరిస్తున్నారనే అనుమానంతో డీజీపీతో మాట్లాడి సూర్యచంద్రరావును వేకెన్సీ రిజర్వుకు పంపించారు. గత ఏప్రిల్‌లో భూతం దుర్గారావు హత్య జరిగిన సందర్భంలోనూ నాగరాజు వర్గీయులతో ఈ పోలీసులకు సంబంధాలు ఉండి ఉంటాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
దుర్గారావు హత్యకేసులో ప్రధాన కుట్రదారు నాగరాజు, పెదఅవుటపల్లి వద్ద జరిగిన ముగ్గు రి హత్యకేసులో ప్రధాన కుట్రదారు భూతం గోవింద్ విదేశాల్లో ఉన్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. వీరిని పట్టుకునేందుకు పోలీసులు అన్ని చర్యలు చేపట్టారు. ఒక డీసీపీ నేతృత్వంలో ఢిల్లీలో పోలీసు ప్రత్యేక బృందం హంతకుల కోసం గాలిస్తోం ది. విజయవాడ కేంద్రంగా మరో ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు సాగిస్తోంది.
పశ్చిమగోదావరి ఎస్పీ డాక్టర్ కొల్లి రఘురామిరెడ్డి కూడా ఈ కేసుపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఆయనతోపాటు విజయవాడ సీపీ వెంకటేశ్వరరావు, మరో డీసీ పీ కలిసి ఎప్పటికప్పుడు ఈ కేసులో పురోగతి ని సమీక్షిస్తున్నారు. హత్యల కుట్రదారులతో పోలీసులకు ఉన్న సంబంధాలపై కూపీ లా గుతున్నారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలో కొందరు పోలీసుల్లో వణుకు మొదలైంది.