Muralikrsna
-
వేములవాడలో వ్యక్తి అనుమానాస్పద మృతి
వేములవాడ మండలకేంద్రంలో మురళికృష్ణ(28) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఇంట్లో ఉరికి వేలాడుతూ స్థానికులు కనిపించాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. కాళ్లను తాడుతో కట్టేసి ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. భార్య మౌనిక పరారీలో ఉంది. వీరి స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి. జీవనోపాధి నిమిత్తం వేములవాడ వచ్చి కూలీపని చేసుకుంటూ జీవిస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితంమౌనిక అనే యువతితో వివాహం అయింది. పిల్లలు లేరు. మురళీకృష్ణను భార్యే చంపిందని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గజరాజుల హల్చల్
కొత్తూరు : ఏజెన్సీలోని గూడల్లో రోజూ ఏదో ఒక ప్రాంతంలో గజరాజులు హడావుడి చేస్తున్నాయి. గిరిజనుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి కొత్తూరు మండలం లబ్బ పంచాయతీ పరిధి ఎగువ దొండమామిడిగూడలో హల్చల్ చేశాయి. గిరిజనగూడ శివారున ఉన్న సవర పంచారకు చెందిన పూరిపాక గోడను తోసి ధ్వంసం చేశాయి. ఏనుగుల ఘీంకారాలతో గ్రామం మార్మోగింది. దీంతో గిరిజనులు ఆందోళన చెంది రాత్రంతా ప్రాణాలు అరచేతపట్టుకుని జాగారం ఉన్నారు. ఏ క్షణంలోనైనా ఇంట్లోకి చొరబడతాయేమోనని రాత్రంతా కాపలాకాశారు. అదే గ్రామానికి చెందిన సవర సన్నాయి, కుమారి, సింహాద్రి, గయారిలకు చెందిన అరటి, పైనాపిల్, కొండచీపురు పంటలను నాశనం చేశాయి. ఏనుగులు నష్టపరిచిన పంటలను, ధ్వంసం చేసిన గోడను పాతపట్నం ట్రైనీ రేంజర్ మురళీకృష్ణ శనివారం పరిశీలించారు. గిరిజనులకు జరిగిన నష్టాలను నమోదు చేసుకున్నారు. ఏనుగుల గుంపు కనిపించినప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఏనుగుల గుంపుపై రాళ్ళు విసరొద్దన్నారు. ఆయనతో పాటు ఏనుగుల ట్రాకర్స్ ఉన్నారు. రూ. 5.5 లక్షల పరిహారం ఏనుగులు నష్టపరిచిన పంటలకు నష్టపరిహారం చెల్లించేందుకు రూ.5.5 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఫారెస్టు సెక్షన్ అధికారి, ట్రైనీ రేంజర్ మురళీకృష్ణ తెలిపారు. ఈ నిధులతో హిరమండలం, సీతంపేట మండలాల్లో నష్టపరిచిన పంటలకు ముందుగా చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఏనుగులు గిరిజన గ్రామాల్లోకి చొరబడకుండా కందిరీగల శబ్దం వచ్చే మెషీన్లతో చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. ఆ శబ్దం వస్తే ఏనుగులు అటువైపు రావని చెప్పారు. గతంలో కారప్పొడితో మంటలు పెట్టామన్నారు. ఈ సారి నూతనంగా వచ్చిన కందిరీగ శబ్దాలతో ఏనుగులను అడవుల్లోకి పంపిస్తున్నామని తెలిపారు. -
ప్రాణాలు తీసిన ఎడబాటు
ఇరువురు కానిస్టేబుళ్ల ఆత్మహత్య కర్నూలులో కలకలం రేపిన ఘటన మృతుల్లో ఒకరికి పెళ్లి నిశ్చయం మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు నేడు పోస్టుమార్టం కర్నూలు : ఇరువురు కానిస్టేబుళ్ల బలవన్మరణం ఘటన జిల్లా కేంద్రం కర్నూలులో కలకలం రేపింది. వీరిలో ఒకరికి పెళ్లి నిశ్చయం కావడంతో ఎడబాటును జీర్ణించుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు చర్చ జరుగుతోంది. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి గన్‌మ్యాన్‌గా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ మురళీకృష్ణ(పీసీ 2435), క్రిష్ణగిరి పోలీసుస్టేషన్లో పని చేస్తున్న సివిల్ కానిస్టేబుల్ వీరేష్(పీసీ 1468)లు నగరంలోని కొత్తపేట ఏఆర్ పోలీసుక్వార్టర్స్ పిండి జిన్ను లైన్‌లోని ఓ గది పై అంతస్తులో సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్రిష్ణగిరి మండలం రామాపురం గ్రామానికి చెందిన వీరేష్ 2013లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. ప్రస్తుతం అదే మండలం గోకులపాడులో పోలీసు పికెట్ విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను ఏఆర్ కానిస్టేబుల్ మురళీకృష్ణతో సహజీవనం చేస్తున్నట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. వెల్దుర్తి మండలం గోవర్దనగిరి గ్రామానికి చెందిన మురళీకృష్ణ కూడా 2013లో ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో కానిస్టేబుల్‌గా చేరాడు. కలుగొట్ల గ్రామానికి చెందిన మేనకోడలితో ఈనెల 30, 31 తేదీల్లో పెళ్లి జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. సన్నిహితంగా ఉన్న వ్యక్తి పెళ్లి చేసుకుని దూరమవుతుండటాన్ని జీర్ణించుకోలేక వీరేష్.. మురళీకృష్ణతో గొడవ పడినట్లు సమాచారం. ఆ సందర్భంగా అతడిని కాల్చడంతో పాటు తనూ కాల్చుకుని చనిపోయినట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. మృతదేహాల పక్కన తుపాకీ ఉండటంతో ఆ మేరకు నిర్ధారణకు వచ్చారు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి గన్‌మ్యాన్‌గా ఉన్న మురళీకృష్ణ తన తండ్రికి ఆరోగ్యం సరిగా లేదని అనుమతి తీసుకుని కర్నూలుకు చేరుకున్నాడు. ఈ విషయం వీరేష్ తెలుసుకుని అతని గదికి వెళ్లి ఒకరినొకరు నిందించుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలపై రక్తం గడ్డకట్టి ఉండటంతో మధ్యాహ్నం ఆ ఘటన జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఐజీ, ఎస్పీ సీఎం బందోబస్తు ఏర్పాట్ల నిమిత్తం అవుకు ప్రాం తానికి వెళ్లిన ఎస్పీ ఆకే రవికృష్ణ రాత్రి 10:30 గంటల సమయంలో కర్నూలు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బాబుప్రసాద్‌తో పాటు పట్టణంలోని పలువురు సీఐలు, పోలీసుల అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ, కోశాధికారి శేఖర్‌బాబు తదితరులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వేలిముద్రల నిపుణులు, ఫోరెన్సిక్ అధికారులను రప్పించి ఆధారాలను సేకరించారు. పోలీసుల అదుపులో శ్యామ్ ఎల్బీఎస్ నగర్లో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న శ్యామ్ అనే వ్యక్తి సాయంత్రం తన స్నేహితుడైన మురళీకృష్ణ నివాసముంటున్న గదికి వెళ్లాడు. మూసి ఉన్న తలుపులను తెరిచి చూడగా కానిస్టేబుళ్లు ఇద్దరూ చనిపోయి ఉండటంతో రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు అతడిని అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎడబాటును జీర్ణించుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మిన్నంటిన రోదనలు కానిస్టేబుళ్ల ఆత్మహత్య ఘటన తెలిసి జనం పెద్ద ఎత్తున గుమికూడటంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించి రాకపోకలకు అంతరాయం కలిగింది. మృతదేహాలను గదిలోనే ఉంచి తాళం వేశారు. బుధవారం ఉదయం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు. బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. -
‘ట్రిపుల్ మర్డర్’లో పోలీసుల పాత్రపై ఆరా
ఏసీపీ, సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల ప్రమేయం ఏసీపీ వీఆర్‌కు, సీఐ, కానిస్టేబుళ్ల సస్పెన్షన్ సాక్షి ప్రతినిధి, విజయవాడ : పెద్దఅవుటపల్లి వద్ద జరిగిన తండ్రి, ఇద్దరు కుమారుల హత్యకేసులో పోలీసుల పాత్రపై దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని పెదవేగి పోలీస్‌స్టేషన్ పోలీసులకు మొదటినుంచీ కల్పతరువుగా మారిందని సమాచా రం. పినకడిమికి చెందిన కొందరు విదేశాల కు వెళ్లి జాతకాలు చెప్పి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న వారిని టార్గెట్ చేసి పెదవేగిలో పనిచేసే పోలీసులు లక్షల్లో సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. పినకడిమి వాసులు కేవలం జాతకాలు చెప్పడం ద్వారానే కోట్లలో డబ్బు ఎలా సంపాదిస్తున్నారనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. జాతకాల పిచ్చి ఉన్న కొంతమంది పోలీసు అధికారులు పినకడిమి లో జాతకాలు చెప్పేవారికి కావాల్సిన అవసరా లు తీర్చడంలో ముందున్నారు. అటువంటివారిపై విజయవాడ సీపీ వెంకటేశ్వరరావు ప్రత్యే క నిఘా వేశారు. పెద్దఅవుటపల్లి వద్ద ముగ్గు రు వ్యక్తులను కాల్చి చంపుతున్నప్పుడు ఇద్దరు కానిస్టేబుళ్లు హతుల కారులోనే ఉండ టం, ఆ తరువాత వారు పరారు కావడం, కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో అసలు విషయం వెలుగులోకి రావడం తెలిసిందే. తాము హతులకు రక్షణగా వెళ్లామని కానిస్టేబుళ్లు చెప్పారు. అయితే వారు అనధికారికంగా ఎందుకు వెళ్లారనేది చర్చనీయాంశమైంది. ఏలూరు వన్‌టౌ న్ సీఐ మురళీకృష్ణ ఆదేశాలతో వారు వెళ్లినప్పటికీ ఆయన కానీ, కానిస్టేబుళ్లు కానీ జరిగిన విషయాన్ని విజయవాడ సీపీకి చెప్పలేదు. విచారణలో ఈ విషయం వెలుగు చూడటంతో సీపీకి మరింత అనుమానం వచ్చింది. బాధితు లు, నిందితులతో ఏలూరు వన్‌టౌన్ పోలీసులకు ఉన్న సంబంధాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో సీఐ, ఇద్దరు కాని స్టేబుళ్ల పాత్ర గురించి తెలిసిన వెంటనే సస్పెం డ్ చేశా రు. వీరిపై కేసు నమోదుకు న్యాయపరంగా ఎదురయ్యే అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో పోలీస్ అధికారికి కుట్రదారులతో ఉన్న సంబంధాలు వెలుగులోకి వచ్చా యి. విజయవాడలో స్పెషల్ బ్రాంచి ఏసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న నక్కా సూర్యచంద్రరావు 2001లో పెదవేగి స్టేషన్ ఎస్సైగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత సీఐగా కూ డా అక్కడ పనిచేశారు. మూడు హత్యల గురిం చి ఆయనకు కొంత సమాచారం తెలిసే అవకాశం ఉందని సీపీ వెంకటేశ్వరరావు భావిం చారు. దీనిపై సూర్యచంద్రరావును వివరాలు అడిగారు. నిందితులు ఎక్కడ ఉన్నారనే దాని పై సూర్యచంద్రరావు నుంచి సమాచారం తెలుసుకునేందుకు సీపీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో ఆయన సూర్యచంద్రరావు ఎవరెవరితో ఎప్పుడెప్పుడు మాట్లాడాడనే విషయా న్ని తెలుసుకునేందుకు ఫోన్ కాల్‌డేటా తెప్పిం చి పరిశీలించారు. ముగ్గురి హత్యకేసులో ప్రధా న కుట్రదారుగా భావిస్తున్న భూతం గోవిం ద్‌తో ఏసీపీ అనేకసార్లు మాట్లాడినట్లు కాల్‌డేటాలో వెల్లడైంది. ఏసీపీ నిజం చెప్పకుండా నిందితునికి పరోక్షంగా సహకరిస్తున్నారనే అనుమానంతో డీజీపీతో మాట్లాడి సూర్యచంద్రరావును వేకెన్సీ రిజర్వుకు పంపించారు. గత ఏప్రిల్‌లో భూతం దుర్గారావు హత్య జరిగిన సందర్భంలోనూ నాగరాజు వర్గీయులతో ఈ పోలీసులకు సంబంధాలు ఉండి ఉంటాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దుర్గారావు హత్యకేసులో ప్రధాన కుట్రదారు నాగరాజు, పెదఅవుటపల్లి వద్ద జరిగిన ముగ్గు రి హత్యకేసులో ప్రధాన కుట్రదారు భూతం గోవింద్ విదేశాల్లో ఉన్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. వీరిని పట్టుకునేందుకు పోలీసులు అన్ని చర్యలు చేపట్టారు. ఒక డీసీపీ నేతృత్వంలో ఢిల్లీలో పోలీసు ప్రత్యేక బృందం హంతకుల కోసం గాలిస్తోం ది. విజయవాడ కేంద్రంగా మరో ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు సాగిస్తోంది. పశ్చిమగోదావరి ఎస్పీ డాక్టర్ కొల్లి రఘురామిరెడ్డి కూడా ఈ కేసుపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఆయనతోపాటు విజయవాడ సీపీ వెంకటేశ్వరరావు, మరో డీసీ పీ కలిసి ఎప్పటికప్పుడు ఈ కేసులో పురోగతి ని సమీక్షిస్తున్నారు. హత్యల కుట్రదారులతో పోలీసులకు ఉన్న సంబంధాలపై కూపీ లా గుతున్నారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలో కొందరు పోలీసుల్లో వణుకు మొదలైంది. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.
కాకినాడ రూరల్, న్యూస్‌లైన్ :కాకినాడ రూరల్ మండలం చీడిగలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ దుర్మరణం పాలైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడ నగరానికి చెందిన రావి అరుణ (31) గురువారం ఉదయం మోటారు సైకిల్‌పై తన పుట్టింటికి రామేశ్వరం వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.కాకినాడ నుంచి రేషన్ షాపులకు సరుకులు తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఓవర్టేక్ చేస్తుండగా ఇంజన్ వెనుక చక్రానికి మోటార్‌సైకిల్ హ్యాండిల్ తగిలి ఆమె రోడ్డుపై పడిపోయింది. ట్రక్కు చక్రాలు ఆమె మీదనుంచి వెళ్లిపోవడంతో అరుణ అక్కడికక్కడే మృతి చెందింది.పోలీసులు మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. కుటుంబసభ్యులు సంఘటన స్థలంలో బోరున విలపించారు. కేసును ఇంద్రపాలెం ఎస్సై మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.