
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఓ ప్రముఖ హోటల్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. దక్షిణ ముంబైలోని మెరైన్ లైన్ సమీపంలో ఫార్చ్యూన్ హోటల్‌లో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ భవనంలోని 1 నుంచి 3 వ అంతస్తు వరకు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకు అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. (ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం)
మొత్తం 8 అగ్నిమాపక వాహనాలు ప్రమాద స్థలానికి చేరుకొని ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకువస్తున్నాయి. అయితే హోటల్‌లో చిక్కుకున్న 25 మంది వైద్యులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చామని, వీరందరిని మరో హోటల్‌కు తరలించామని అగ్నిమాపక అధికారులు తెలిపారు. కాగా షాట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగింటుందని అధికారులు భావిస్తున్నారు. (బోరుబావిలో పడిన బాలుడి మృతి )
Comments
Please login to add a commentAdd a comment