చట్టాన్ని గౌరవించటం తప్పా? | Transfer of shares without informing the court | Sakshi
Sakshi News home page

చట్టాన్ని గౌరవించటం తప్పా?

Published Sat, Oct 26 2024 5:46 AM | Last Updated on Sat, Oct 26 2024 9:46 PM

Transfer of shares without informing the court

జగన్‌కు తెలియకుండా, ఆయన ప్రమేయం లేకుండానే సరస్వతీ పవర్‌లో వాటాల మార్పు

హైకోర్టు స్టేను ఉల్లంఘిస్తూ తల్లి ద్వారా కథ నడిపించిన షర్మిల

కనీసం కోర్టుక్కూడా సమాచారమివ్వకుండా షేర్ల బదలాయింపు

సొంత అన్నను న్యాయపరంగా ఇబ్బంది పెట్టాలని చంద్రబాబుతో కలిసి కుట్ర

ఇది తెలిసి... చట్టవిరుద్ధ చర్యను ఆపాలంటూ ఎన్‌సీఎల్‌టీకి జగన్‌

తమ పాచిక పారకపోవటంతో ‘తల్లిపై జగన్‌ కేసు’ అంటూ ‘ఎల్లో’ డ్రామా  

కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమంగా పెట్టిన కేసులు­న్నాయి. ఏడాదిన్నర జైల్లో ఉండి బెయిలుపై బయటకు వచ్చారాయన. పైపెచ్చు ఆ కంపెనీల ఆస్తులన్నీ ఈడీ, సీబీఐ జప్తులో ఉన్నాయి. ఆ ఆస్తులకు సంబంధించి ఎలాంటి లావాదేవీలూ జరపకూడదని హైకోర్టు ఇచ్చిన ‘స్టే’ ఉత్త­ర్వులూ ఉన్నాయి. మరి ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ఏమవుతుంది? దీనికి సమాధాన­మివ్వ­టానికి న్యాయనిపుణులే అక్కర్లేదు. కాస్త చదువు, ఇంకాస్త ఇంగిత జ్ఞానం ఉన్నవారెవరైనా చాలు. 

కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తే దాని ప్రభావం బెయిలుపైనా పడే ప్రమాదముంటుంది! ఇదిగో... సరస్వతీ పవర్‌ షేర్ల బదిలీ వ్యవహా­రంలో ఇదే జరిగింది. వైఎస్‌ జగన్‌కు తెలియ­కుండా ఆయన పేరిట ఉన్న షేర్లను తల్లి పేరిట సోదరి షర్మిలే దగ్గరుండి మార్పించేశారు. షేరు హోల్డరైన జగన్‌కు కనీసం సమాచారమూ ఇవ్వలేదు. కోర్టు స్టే ఉత్తర్వులున్నా... కనీసం కోర్టుకూ చెప్పలేదు. పెద్ద మనుషుల ఒప్పందం మాదిరి తల్లి పేరిట రాసిన అన్‌ రిజిస్టర్డ్‌ గిఫ్ట్‌డీడ్‌ను ఉపయోగించుకుని షేర్లను తల్లి పేర మార్పించేశారామె. దీంతో కంపెనీ యాజ­మాన్యం పూర్తిగా తల్లి చేతికి వచ్చినట్లవుతుంది. 

మరి ఇది కోర్టు ఉల్లంఘనే కదా? జగన్‌కు తెలియకుండా జరిగినా... కోర్టు దృష్టిలో తప్పే కదా? మరి ఈ తప్పును కోర్టు దృష్టికి తేవాల్సిన అవసరం జగన్‌కు లేదా? ఈ లావా­దేవీని కోర్టు దృష్టికి తెచ్చి... రద్దు చేయమంటూ కోరటం తప్పెలా అవుతుంది? తనకు తెలియ­కుండా తన పేరిట చెల్లెలు చేసిన తప్పును సరిదిద్దడానికి ఆయన నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌టీని) ఆశ్రయించటాన్ని చంద్రబాబు కూటమి ఎందుకంత ఘోరమైన తప్పిదం మాదిరి ప్రచారం చేస్తోంది? దాన్ని తల్లిపై కేసు వేసినట్లుగా ఎందుకు చూడాలి? న్యాయపరంగా రక్షించుకోవటానికి జగన్‌ ఎన్‌సీఎల్‌టీకి వెళ్లటం తప్పెలా అవుతుంది? 

ఆలోగా చేయటం చట్టవిరుద్ధం కాబట్టే..
సొంత అన్న న్యాయపరంగా ఇబ్బంది పడతాడని తెలిసి కూడా షర్మిల ఇలా చేయటానికి అసలు కారణం... చంద్రబాబు నాయుడు. బాబు పన్నిన లోతైన కుట్రలో షర్మిల భాగం. అంతా కలిసే జగన్‌ను ఇబ్బంది పెట్టాలనుకున్నారు. అందుకే రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు. వీటిని పసిగట్టి జగన్‌ వెంటనే కోర్టును ఆశ్రయించటంతో... తమ పన్నాగం బెడిసికొట్టిందని గ్రహించి దీనికి ‘తల్లిపై వేసిన కేసు’గా కలర్‌ ఇస్తున్నారు. 

ఆస్తుల కోసం జగన్‌ తన కుటుంబీకులతోనే పోరాడుతున్నారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు సరస్వతీ పవర్‌లో 100 శాతాన్ని షర్మిలకు ఇచ్చేస్తానని చెప్పాక... అప్పటికే 49 శాతం తల్లిపేరిట మార్పించి... తన మాటపై మరింత భరోసా కలిగేలా మిగిలిన 51 శాతాన్ని కూడా గిఫ్ట్‌గా ఇస్తానని రాసేశారంటే ఏమిటర్థం? ఆ ఆస్తిని పూర్తిగా వదులుకున్నట్లేగా? కాకపోతే కేసులున్నాయి కనక... అవన్నీ పూర్తిగా తొలగిపోయాకే ఆ షేర్లను చట్టబద్ధంగా షర్మిల పేరిట బదిలీ చేస్తానన్నారు.

ఆలోగా చేయటం చట్టవిరుద్ధం కనక తాను చేయనన్నారు. అందుకే ఒరిజినల్‌ షేర్‌ సర్టిఫికెట్లు తనవద్దే ఉంచుకున్నారు. కానీ షేర్‌ సర్టిఫికెట్లు పోయాయనే అబద్ధాలతో తల్లి ద్వారా షర్మిల అలాంటి చట్టవిరుద్ధమైన పని చేసేయటంతో... విధిలేక కోర్టును ఆశ్రయించారు. ఇదీ నిజం. ఇదే నిజం.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement