
ఒకప్పుడు నటి షకీలా ఈ పేరు వింటేనే ఒకప్పుడు కుర్రకారు గుండెలు లయ తప్పేవి. ఆమె నటించిన చిత్రాలు విడుదల అవుతున్నాయి అంటే మలయాళ సూపర్‌స్టార్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. అంతటి చరిత్ర ఉన్న శృంగార కథానాయకి షకీలా. ఒకప్పుడు మలయాళంలో గంటల కాల్‌షీట్స్ ఇచ్చి నటించిన మోస్ట్ వాంటెడ్ నటి.
(ఇది చదవండి: విషమంగా పంచ్ ప్రసాద్ ఆరోగ్యం.. ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు!)
బహుభాషా నటిగా గుర్తింపు పొందిన షకీలా ఒక సమయంలో చిత్రానికి దర్శకత్వం వహించే ప్రయత్నం కూడా చేశారు. అదే విధంగా తన జీవిత చరిత్రను కూడా రాసుకున్నారు. అలాంటి నటి ప్రస్తుతం అడపా దడపా వస్తున్న అవకాశాల్లో నటిస్తూ సీరియళ్లలో, టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కాలం గడుపుతున్నారు. అయితే షకీలా బాగా ఆస్తులు కూడబెట్టారని, బీఎండబ్ల్యూ కారులో తిరుగుతున్నారనే ప్రచారం జరిగింది.
ఇలాంటి వార్తలపై స్పందించిన షకీలా ఒక భేటీలో పేర్కొంటూ నిజమే తాను చాలా ఆస్తులు సంపాదించుకున్నానన్నారు. ఒకప్పుడు రోజుకు రూ.4 లక్షలు తీసుకున్నానని చెప్పారు. అయితే తన సంపాదన అంతా ఆదాయ శాఖాధికారులు సోదాలు చేస్తారని తన సోదరి ఆస్తులు రాయించుకుని మోసం చేసినట్లు తెలిపింది. అలాంటిది తనకు ఇప్పుడు బీఎండబ్ల్యూ కారు ఉన్నట్లు వదంతులు పుట్టిస్తున్నారని.. నిజానికి సొంత ఇల్లు కూడా లేక తాను అద్దె ఇంటిలో ఉంటున్నట్లు నటి షకీలా పేర్కొంది.
(ఇది చదవండి: రైలు ప్రమాద ఘటనతో నా గుండె పగిలింది: అల్లు అర్జున్)
Comments
Please login to add a commentAdd a comment