సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో నమోదైన మల్టీలేవెల్ మార్కెటింగ్ కేసులో ఇండస్ వీవాకు చెందిన రూ.66.30 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ ఆదేశాలు జారీచేసింది. పిరమిడ్ పద్ధతిలో ఒకరిని జాయిన్ చేస్తే 20 శాతం కమీషన్ పద్ధతిలో 10 లక్షల మంది సభ్యుల నుంచి రూ.1,500 కోట్లు వసూలు చేసిన ఇండస్ వీవా కంపెనీ వ్యవహారంలో ఈడీ చర్యలు చేపట్టింది.
మనీల్యాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించి చర్యలు చేపట్టినట్లు దర్యాప్తు సంస్థ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఇండస్ వీవా హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సీఏ అంజార్, ప్రమోటర్ అభిలాష్ థామస్‌ను గతేడాది డిసెంబర్‌లోనే అరెస్ట్ చేసిన ఈడీ.. మనీల్యాండరింగ్ ద్వారా కోట్ల రూపాయలతో ఆస్తుల కొన్నట్టు గుర్తించింది. రూ.50.47 కోట్ల విలువైన స్థిరాస్తులు, కంపెనీకి చెందిన 20 అకౌంట్లలోని రూ.15.83 కోట్ల నగదును జప్తు చేసినట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment